Sumati Shatakam Movie Review : సుమతీ శతకం మూవీ రివ్యూ

Sumati Shatakam Movie Review :  సుమతీ శతకం మూవీ రివ్యూ
X

రివ్యూ : సుమతీ శతకం

ఆర్టిస్ట్స్ : అమర్ దీప్ చౌదరి, శైలీ చౌధరి, టేస్టీ తేజ, మహేష్ విట్టా తదితరులు

ఎడిటర్ : నహీద్ మహమ్మద్

సంగీతం : సుభాష్ ఆనంద్

సినిమాటోగ్రఫీ : ఎస్ హలేష్

నిర్మాత : సాయి సుధాకర్ కొమ్మాలపాటి

దర్శకత్వం : ఎం.ఎం. నాయుడు

సీరియల్స్, రియాలిటీ షోస్‌తో పేరు తెచ్చుకున్నాడు అమర్ దీప్ చౌదరి. అతను హీరోగా నటించిన మూవీ 'సుమతీ శతకం'. శైలి చౌదరి కథానాయిక. ప్రమోషన్స్ తో బాగా ఆకట్టుకుందీ టీమ్. అమర్ దీప్ చేతికి గాయం తగిలినా తగ్గేదే లే అన్నట్టుగా కనిపించాడు. రవితేజ ఇచ్చిన బైట్ ప్లస్ అయింది. మరి ఇన్ని రకాలుగా ప్లస్ పాయింట్స్ ఉన్న సుమతీ శతకం ఎలా ఉంది అనేది చూద్దాం.

కథ:

కృష్ణ (అమర్ దీప్ చౌదరి)ది కిరాణా కొట్టు వ్యాపారం. అతనిది తూర్పు గోదావరి జిల్లాలోని వైకుంఠపురం. పెళ్లి చేసుకోవాలని ఆరాటపడతుంటాడు. అయితే అమ్మాయి దొరకదు. దగ్గరలోని ఓ ఊరి గుడికి వెళ్ళినప్పుడు సుమతి (శైలి చౌదరి) కనిపిస్తుంది. తొలి చూపులో ప్రేమలో పడతాడు. ఆమెకు దగ్గర కావడానికి చాలా ప్రయత్నాలు చేస్తాడు. చివరికి అవన్నీ ఫలిస్తాయి. కానీ కృష్ణ - సుమతి పెళ్లికి ఒక అడ్డంకి వస్తుంది. అది ఏమిటి? దాన్ని కృష్ణ ఎలా అధిగమించాడు? వీళ్ళ ప్రేమ కథకు, గుడికి సంబంధం ఏమిటి? వంటి ప్రశ్నలకు సమాధానాలు సినిమా చూసి తెలుసుకోవాలి.

ప్లస్ పాయింట్స్ :

పెళ్లి అంశంలో పల్లెటూళ్లలో తల్లిదండ్రుల ఆలోచన, పల్లెటూళ్లలో యువకులకు ఎదురు అవుతున్న ఇబ్బందులను వినోదాత్మకంగా, ప్రేక్షకులు నవ్వుకునేలా ప్రతి సన్నివేశాన్ని తీరు బావుంది. 'సుమతీ శతకం' చిత్రానికి ఆయువుపట్టు ఆ వినోదం ఒక్కటే కాదు... అంతకు మించి భావోద్వేగం. పల్లెటూరి ప్రజల్లో ఉన్న భక్తితో పాటు మూఢ నమ్మకాల వల్ల ఏర్పడిన సమస్యను, ఆ సమస్య వల్ల ఓ అమ్మాయి జీవితం ఎలా మారిందనే అంశం నుంచి ఎమోషన్ ను పండించిన విధానం బావుంది.

పల్లెటూరి కథానాయకుడిగా పాత్రలో అమర్ దీప్ చౌదరి ఒదిగిపోయారు. టీవీ షోస్ చూసిన వీక్షకులకు ఆయన హుషారు తెలుసు. ఆ ఎనర్జీ క్యారెక్టర్‌ను డామినేట్ చేయకుండా నటించారు. కథానాయిక శైలి చౌదరి చూడముచ్చటగా ఉంది. సుమతి పాత్రకు అవసరమైన అమాయకత్వంతో పాటు అవసరమైన చోట ఉగ్రరూపం చూపించింది. టేస్టీ తేజ పాత్రకు తగ్గట్టు నవ్వించారు. దర్శక రచయిత ఎంఎం నాయుడు సాధారణ పల్లెటూరి ప్రేమ కథగా సినిమాను ప్రారంభించినా... నిదానంగా భక్తి వైపు కథను తీసుకు వెళ్లిన తీరు అభినందనీయం. నిర్మాణ విలువలు బావున్నాయి.

మైనస్ పాయింట్స్ :

ఫస్టాఫ్ రొటీన్‌గా సాగడం సినిమాకు మైనస్. పల్లెటూరిలో లవ్ ఎట్ ఫస్ట్ సైట్ స్టోరీ తీసినట్టు అనిపిస్తుంది. అమర్ దీప్, శైలి చౌదరి మధ్య ప్రేమ కథలో ఆశించినంత బలం లేదు. ఊరిలో గుడి రంగులు వేయడం వంటి కొసరు కథలకు కాస్త ఎక్కువ సమయం కేటాయించినట్టు తొలుత అనిపిస్తుంది. అయితే పతాక సన్నివేశాల్లో ఆ అంశాలను ముడిపెట్టారు. కానీ అప్పటికే ఆలస్యం అయ్యింది. నిడివి పావుగంట తగ్గించి ఉంటే బావుండేది. ట

టెక్నికల్ గా ఎలా ఉంది:

థియేటర్లలో ప్రేక్షకులకు పల్లెటూరి ఫీల్ తీసుకు రావడంలో ఛాయాగ్రహకుడు సుభాష్ ఆనంద్ సక్సెస్ అయ్యారు. అయితే కథనం నిదానంగా సాగింది. కానీ దర్శకుడు వినోదం, భావోద్వేగాలు బాగా చూపించారు. ఎస్ హాలేష్ సంగీతం పల్లెటూరి కథకు తగ్గట్టు ఉన్నాయి. ప్రొడక్షన్ వాల్యూస్ బావున్నాయి. దర్శకుడుగా ఎమ్ఎమ్ నాయుడు ఇంకాస్త బెటర్ వర్క్ చేసి ఉండాల్సింది అనిపిస్తుంది. రైటింగ్ పరంగా, కామెడీ పరంగా పెద్దగా మెప్పించలేకపోయాడు.

ఫైనల్ గా : సుమతీ శతకం మెప్పించే సినిమా

రేటింగ్ : 2.75/౫


Tags

Next Story