The GOAT Movie Review : రివ్యూ : ది గోట్ - గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్

The GOAT Movie Review  :   రివ్యూ : ది గోట్ - గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్

రివ్యూ : ది గోట్ - గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్

ఆర్టిస్ట్స్ : విజయ్, స్నేహ, లైలా, ప్రశాంత్, ప్రభుదేవా, అజ్మల్, మైక్ మోహన్, మీనాక్షి చౌదరి, జయరాం తదితరులు

ఎడిటర్ : వెంకట్ రాజన్

సంగీతం : యువన్ శంకర్ రాజా

సినిమాటోగ్రఫీ : సిద్ధార్థ నూని

నిర్మాతలు : కలైపులి ఎస్ థాను, కలైపులి ఎస్. గణేష్, కలైపులి ఎస్. సురేష్

దర్శకత్వం : వెంకట్ ప్రభు

తెలుగు రిలీజ్ : మైత్రీ మూవీ మేకర్స్

దళపతి విజయ్ సినిమా అంటే తమిళనాట ఎంత హంగామా ఉంటుందో అందరికీ తెలుసు. ఇక మరో సినిమా తర్వాత పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు కాబట్టి ద గోట్ మూవీపై భారీ అంచనాలున్నాయి. వెంకట్ ప్రభు డైరెక్ట్ చేసిన ఈ మూవీ ఇవాళ ( గురువారం) విడుదలైంది. మరి ఈ గోట్ ఎలా ఉందో చూద్దాం.

కథ :

గాంధీ (విజయ్) స్పెషల్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ లో పని చేస్తుంటాడు. అతని టీమ్ లో సునిల్ ( ప్రశాంత్ ), కళ్యాణ్ ( ప్రభుదేవా ) అజయ్ ( అజ్మల్ అమీర్ ) తో కూడిన టీమ్ ఉంటుంది. ఏ ఆపరేషన్ అయినా ఈ నలుగురూ కలిసి చేస్తుంటారు. ఓ సారి కెన్యాలో ఓ ప్రమాదకరమైన బయో వెపన్ ను డిస్మాటిల్ చేసే టైమ్ లో అదే ట్రైన్ లో ఉన్న రాజీవ్ మీనన్ ( మోహన్) ను చూస్తారు. అతను గతంలో ‘రా’చీఫ్ గా పనిచేసి దేశ ద్రోహానికి పాల్పడి పారిపోతాడు. అతన్ని కూడా పట్టుకునే క్రమంలో ట్రెయిన్ పేలిపోతుంది. ఆ తర్వాత గాంధీ థాయ్ లాండ్ లో మరో ఆపరేషన్ కోసం వెళతాడు. తనతో పాటు గర్భంతో ఉన్న భార్య (స్నేహ) ఐదేళ్ల కొడుకును కూడా తీసుకువెళ్లాల్సి వస్తుంది. అక్కడ కొందరు టెర్రరిస్ట్ లు అతనిపై అటాక్ చేస్తారు. భార్యక పురిటి నొప్పులు వస్తే వారి నుంచి తప్పించుకుని హాస్పిటల్ లో కొడుకు కిడ్నాప్ అవుతాడు. అతన్ని వెదికే క్రమంలో కొడుకును కిడ్నాప్ చేసిన లేడీ కార్ యాక్సిడెంట్ కు గురై.. చనిపోతాడు. అప్పటి నుంచి భార్య అతనికి దూరంగా ఉంటుంది. గాంధీ స్క్వాడ్ వదిలేసి ఎయిర్ పోర్ట్ లో పనిచేస్తుంటాడు. అదే టైమ్ లో రష్యాలో జరిగిన ఓ ఇన్సిడెంట్ కారణంగా అక్కడ సిట్యుయేషన్ ను సెట్ చేయమని పంపిస్తారు. అక్కడ అచ్చంగా తనలాగే ఉన్న ఓ కుర్రాడిని చూస్తాడు. ఆ కుర్రాడే వచ్చి మీరు నా తండ్రా అని అడుగుతాడు. మరి చనిపోయాడనుకున్న కుర్రాడు ఎలా బతికాడు..? ఇన్నాళ్లు ఎక్కడ ఉన్నాడు.. అతను వచ్చిన తర్వాత గాంధీ జీవితంలో వచ్చిన మార్పులు ఏంటీ అనేది మిగతా కథ.

ఎలా ఉంది..

కొన్ని కథలు పేపర్ పై బానే అనిపిస్తాయి. పిక్చర్ గా బోర్ కొడతాయి. ద గోట్ అలాంటి మూవీనే. ఇంత పెద్ద స్పాన్ ఉండి, అంతమంది ఆర్టిస్టులు ఉన్న సినిమాలో ఒక్కటంటే ఒక్కటి కూడా వావ్ అనిపించే సీన్ లేదంటే దర్శకుడు ఎంత బాధ్యతా రహితంగా ఉన్నాడో అర్థం చేసుకోవచ్చు. అసలు ట్రైలర్ వచ్చినప్పుడే తేడాగా అనిపించింది. అది నిజమే అని సినిమా చూస్తే అర్థం అవుతుంది. ఒక ‘రా’ ఏజెంట్ అనగానే మనకు ప్రత్యేకమైన బాడీ లాంగ్వేజ్, అతని డెడికేషన్, దేశం పట్ల తపన, వీటిని దాటి శతృవుల నుంచి దేశాన్ని కాపాడేందుకు ప్రాణాలు ఫణంగా పెట్టి పోరాడే నైజం.. ఇవన్నీ గుర్తొస్తాయి. బట్ ఆ పాత్రను చాలా సిల్లీగా చూపించాడు దర్శకుడు. పైగా అతనికో టీమ్. తాగడానికి తప్ప పెద్దగా ఫైట్స్ చేయని టీమ్ ఇది. ఎంత ప్రేమ ఉన్నా.. నెలలు నిండిన గర్భిణీని తీసుకుని థాయ్ లాండ్ వరకూ వెళ్లడం ఏ లాజిక్ కూ అందదు. పిల్లాడు చనిపోవడానికి కారణమయ్యాను అన్న ‘గిల్టీ నెస్’ కారణంగానే ఏళ్ల తరబడి భార్య, భర్త దూరంగా ఉండటం చూస్తే చాలా సినిమాలే గుర్తొస్తాయి. ఆ మాటకొస్తే ఫస్ట్ హాఫ్ అంతా రాజశేఖర్ గరుడవేగ, ద ఫ్యామిలీ మేన్ అనే వెబ్ సిరీస్ గుర్తొస్తాయి. చాలా సీన్లు అవే. బట్ అంత ఇంటెన్సిటీ కనిపించదు. ఇంటర్వెల్ ట్విస్ట్ తో కొడుకే విలన్ అని చెప్పడం.. దళపతి వర్సెస్ ఇళయదళపతి అని వేయడంతో ఇక ఇప్పటి నుంచైనా కథనం పరుగులు పెడుతుందనుకుంటే.. నెక్ట్స్ సీన్ ఏంటో ఇట్టే ఊహించేలా ఉంటుంది. దీంతో సెకండ్ హాఫ్ పూర్తిగా తేలిపోయింది.

కొడుకు పాత్రను ఏఐ ద్వారా క్రియేట్ చేసినట్టున్నారు. అతను చూస్తే కార్టూన్ బొమ్మలా ఉన్నాడు తప్ప ప్రాణం ఉన్న మనిషిలా లేడు. అలాగే గ్రాఫిక్స్, విఎఫ్ఎక్స్ కూడా నార్మల్ గా ఉన్నాయి.

నటన పరంగా విజయ్ తన వరకూ ఏదో అలా అనిపించేశాడు. బట్ ఆ అతి తమిళ్ ప్రేక్షకులు భరిస్తారేమో కానీ మనవాళ్లు భరించలేరు. త్రిష ఫస్ట్ ఐటమ్ సాంగ్ చేయడం విశేషం. ఇతర పాత్రకు పెద్ద ప్రాధాన్యత అంటే ప్రశాంత్, ప్రభుదేవాల ట్విస్ట్ కాస్త ఆకట్టుకుంటుంది. వీరి నటన కూడా అంతంతే. స్నేహ, లైలా, మీనాక్షి చౌదరి ఓకే అనిపించారు. విలన్ గా మైక్ మోహన్ సెట్ అవలేదు. మిగతా పాత్రలన్నీ రొటీన్.

టెక్నికల్ గా చూస్తే.. ఒకప్పుడు తన సినిమాలతో సినిమాలను నిలబెట్టాడు యువన్ శంకర్ రాజా. బట్ కొన్నాళ్లుగా టచ్ కోల్పోయాడు. ఇలాంటి టైమ్ లో విజయ్ లాంటి స్టార్ మూవీ వస్తే ప్రూవ్ చేసుకోవాలి. బట్ అతనూ తేలిపోయాడు. పాటలు బాలేదు. నేపథ్య సంగీతం యావరేజ్. సినిమాటోగ్రఫీ బావుంది. ఎడిటింగ్ అనేది దర్శకుడి ఇష్టం కాబట్టి.. లెంగ్త్ చాలా ఎక్కువే అయింది. మాటల్లో మెరుపులు లేవు కానీ ఓకే. ప్రొడక్షన్ వాల్యూస్ బావున్నాయి.

దర్శకుడు వెంకట్ ప్రభు శైలి ఎప్పుడూ భిన్నంగానే ఉంటుంది. కానీ హిట్ అయితే బ్లాక్ బస్టర్ గా మారడం లేదంటే డిజాస్టర్ ఇవ్వడం మాత్రమే అతనికి బాగా తెలుసు. మొత్తంగా ఎన్నికలకు వెళ్లే ముందు విజయ్ కి ఓ బ్యాడ్ మూవీ ఇచ్చాడు అనే చెప్పాలి.

ఫైనల్ గా .. ఆడియన్స్ ను గొర్రెలను చేశారు

రేటింగ్ : 1.5 /5

- బాబురావు. కామళ్ల

Tags

Next Story