రివ్యూ

The Warriorr Review: ది వారియర్ రివ్యూ.. హీరోకు ధీటుగా విలన్..

The Warriorr Review: ఈ శుక్రవారం థియేటర్లలో విడుదలయిన ది వారియర్ మూవీ ప్రేక్షకులు ఆకట్టుకోగలిగిందా? లేదా?

The Warriorr Review: ది వారియర్ రివ్యూ.. హీరోకు ధీటుగా విలన్..
X

The Warriorr Review: టాలీవుడ్‌లో చాక్లెట్ బాయ్‌గా పేరు తెచ్చుకున్నాడు రామ్ పోతినేని. కానీ గతకొంతకాలంగా ఆ ఇమేజ్ నుండి బయటికి రావాలనుకుంటున్న రామ్.. గత కొంతకాలంగా మాస్ సినిమాలు చేస్తున్నాడు. అదే వరుసలో ఇప్పుడు 'ది వారియర్'తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. సీనియర్ తమిళ డైరెక్టర్ లింగుసామి ఈ సినిమాతో తెలుగులో డెబ్యూ చేశారు. ఈ శుక్రవారం థియేటర్లలో విడుదలయిన ది వారియర్ మూవీ ప్రేక్షకులు ఆకట్టుకోగలిగిందా? లేదా?

కథ

కర్నూలులోని హాస్పిటల్‌లో ఇంటర్న్‌షిప్ చేయడానికి వస్తాడు డాక్టర్ సత్య (రామ్). ఓ సందర్భంలో హాస్పిటల్‌లో జరుగుతున్న అక్రమాలను బయటపెడతాడు. ఆ అక్రమాల వెనక ఉండేది గురు (ఆది పినిశెట్టి). దీని వల్ల వారిద్దరి మధ్యలో శతృత్వం మొదలవుతోంది. ఇక సత్య లవ్ ఇంట్రెస్ట్‌గా కనిపించింది ఆర్‌జే విజిల్ మహాలక్ష్మి (కృతి శెట్టి) ఆ తర్వాత పోలీస్‌గా మారిన సత్య.. గురును ఎలా మట్టుబెడతాడు అనేది తెరపై చూడాల్సిన కథ.

విశ్లేషణ

ఓవైపు డాక్టర్‌గా, మరోవైపు పోలీస్ ఆఫీసర్‌గా రెండు షేడ్స్‌లో రామ్ నటన బాగుంది. కృతి శెట్టి కమర్షియల్ సినిమాలోని హీరోయిన్ పాత్రలో కూడా తన క్యూట్‌నెస్‌తో ఇంప్రెస్ చేయడానికి ట్రై చేసింది. గురుగా ఆది పినిశెట్టి క్యారెక్టర్ సినిమాకు చాలా కీలకంగా నిలిచింది. ముఖ్యంగా విలన్ ఇంట్రడక్షన్ బాగా ప్లాన్ చేశారు డైరెక్టర్ లింగుసామి. లింగుసామి ఇతర తమిళ చిత్రాలలాగానే ది వారియర్‌లో కూడా యాక్షనే హైలెట్‌గా నిలిచింది.

ప్లస్, మైనస్

ది వారియర్‌లో రామ్, ఆది మెయిన్ ప్లస్. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ పరవాలేదనిపించినా కూడా పాటల విషయంలో మాత్రం దేవీ శ్రీ ప్రసాద్ దుమ్ము దులిపేశాడు. యాక్షన్ సీన్స్ అయితే విజిల్ వేయించేలా ఉంటాయి. స్క్రీన్ ప్లే, రొటీన్ స్టోరీ అనేవి సినిమాను బ్లాక్ బస్టర్ హిట్ అవ్వకుండా ఆపే స్పీడ్ బ్రేకర్స్‌లాగా ఉంటాయి. మొత్తానికి 'ది వారియర్' ఒక కమర్షియల్ కాప్ సినిమా.

Divya Reddy

Divya Reddy

TV5 News Desk


Next Story

RELATED STORIES