Thiru Movie Review: 'తిరు' మూవీ రివ్యూ.. ఆ సినిమాను తలపించే కథ..

Thiru Movie Review: ఎప్పుడూ కొత్త కథలతో ప్రేక్షకుల ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాడు ధనుష్. ఒకవేళ తన సినిమా కథ మామూలుగా ఉన్నా.. దాన్ని తన నటనతో ఓ రేంజ్‌కు తీసుకెళ్లగలడు ఈ హీరో. ఇక తాజాగా మిత్రన్ ఆర్.జవహర్ దర్శకత్వంలో ధనుష్ నటించిన 'తిరుచిత్రంబలం'.. తెలుగులో 'తిరు' అనే పేరుతో విడుదలయ్యింది. ఈ మూవీకి ప్రేక్షకుల రివ్యూ ఏంటంటే..
కథ
తిరు ఏకాంబరం అలియాస్ పండు (ధనుష్) ఫుడ్ డెలివరీ బాయ్‌గా పనిచేస్తుంటాడు. తన అపార్ట్‌మెంట్‌లోనే ఉండే శోభన (నిత్యామీనన్)తో తిరుకు సాన్నిహిత్యం ఎక్కువ. తన జీవితంలో జరిగిన ఓ యదార్థ సంఘటన వల్ల తిరు చదువు మానేయాల్సి వస్తుంది. అప్పటినుండి డెలివరీ బాయ్‌గా పనిచేస్తూ తన తండ్రి (ప్రకాష్ రాజ్), తాత సీనియర్ పండు (భారతీరాజా)తో కలిసి జీవిస్తుంటాడు. అదే సమయంలో అనూష (రాశిఖన్నా), రంజని (ప్రియ భవానీ శంకర్)లను తిరు ఇష్టపడతాడు. ఈ విషయంలో శోభన తనకు సాయం కూడా చేస్తుంది. ఆ తర్వాత తిరు జీవితంలో ఏం జరిగింది అనేదే సినిమా.
విశ్లేషణ
తిరు కథ.. ఇప్పటివరకు ఎన్నోసార్లు చూసినట్టే అనిపిస్తుంది. ముఖ్యంగా ధనుష్, నిత్యామీనన్ మధ్య కెమిస్ట్రీ 'నువ్వే కావాలి'లాంటి ఎన్నో చిత్రాలను గుర్తుచేస్తుంది. కానీ ధనుష్, నిత్యామీనన్‌ల నటన సినిమాకు హైలెట్‌గా నిలుస్తుంది. తిరు తల్లికి ఏమైంది అనే అంశం ప్రేక్షకుల్లో ఉత్సాహాన్ని పెంచుతుంది. ఇక ప్రకాశ్ రాజ్, భారతీరాజాతో కలిసి ధనుష్ చేసే కామెడీ సినిమా ఫస్ట్ హాఫ్‌ను నిలబెడుతుంది. తిరు చిత్రంలోని సెకండ్ హాఫ్‌కంటే ఫస్ట్ హాఫ్ బాగుందని కొందరి ప్రేక్షకులు అంటున్నా.. ధనుష్ ఫ్యాన్స్ మాత్రం సినిమా హిట్టే అని రివ్యూ ఇచ్చేస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com