Veerabhadradu Movie Review : వీరభద్రుడు మూవీ రివ్యూ

Veerabhadradu Movie Review :  వీరభద్రుడు మూవీ రివ్యూ
X

రివ్యూ : వీరభద్రుడు

ఆర్టిస్ట్స్ : సూర్య, త్రిష, ఆర్జే బాలాజీ, నాట్టీ సుబ్రహ్మణియన్, శ్వాసిక, ఇంద్రన్, సుప్రీత్, మన్సూర్ అలీఖాన్ తదితరులు

ఎడిటర్ : ఆర్. కలైవానన్

సంగీతం : సాయి అభ్యంకర్

సినిమాటోగ్రఫీ : జి.కే. విష్ణు

నిర్మాతలు : ఎస్ఆర్ ప్రభు, ఎస్ఆర్ ప్రకాష్ బాబు

దర్శకుడు : ఆర్.జే. బాలాజీ

హీరో సూర్య అంటే తెలుగులోనూ మంచి క్రేజ్ ఉంది. అతనికీ సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. కాకపోతే కొన్నాళ్లుగా సరైన హిట్ లేక ఇబ్బంది పడుతున్నాడు. ఈ క్రమంలో వీరభద్రుడు అనే మూవీతో వచ్చాడు. ఇప్పటి వరకూ మంచి బలమైన కథలతో మెప్పించిన దర్శకుడు ఆర్జే బాలాజీ ఈ చిత్రానికి దర్శకుడు. దీంతో ఈ మూవీ గ్యారెంటీ హిట్ అనే ట్యాగ్ ఉంది. త్రిష ఫీమేల్ లీడ్ గా నటించిన ఈ మూవీ ఎలా ఉంది అనేది చూద్దాం.

కథ :

బేబీ కృష్ణ(ఆర్జే బాలాజీ) పేరుమోసిన లాయర్. అంతే స్థాయిలో అత్యంత అవినీత పరుడైన లాయర్ కూడా. అతనికి తోడుగా జడ్జ్ కూడా ఉంటాడు. అదే కోర్ట్ లో ఓ లేడీ లాయర్(త్రిష) కూడా కొన్ని కేస్ లపై వాదిస్తూ ఉంటుంది.కానీ ఆ లాయర్ బేబీ వల్ల ఓడిపోతూనే ఉంటుంది. వీరికి ఓ వృద్ధుడి కేస్ వస్తుంది. ఆ వృద్ధుడు తన కూతురుకు అనారోగ్య సమస్యలు ఉన్నాయి అని తన నగలు అమ్మి ఆమెకు వైద్యం చేయించాలనుకుంటాడు. అనుకోకుండా ఆ నగలను దొంగలు కొట్టేస్తారు. పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తాడు. చివరికి నగలు దొరుగుతాయి. కానీ కొంత తగ్గుతాయి. అయినా ఆ కేస్ కోర్ట్ వరకు వెళుతుంది. ఆ నగలపై మోజు పడిన లాయర్ బేబీతో పాటు జడ్జ్ కూడా వీరిని బాగా ఇబ్బంది పెడుతుంటాడు. అదే సమయంలో అదే కోర్ట్ ఆవరణలో ఉన్న వీరభద్రుడు(సూర్య) గుడి ఉంటుంది. ఆ గుళ్లో ఏం మొక్కుకున్నా జరిగిపోతుందని ప్రజలు నమ్ముతుంటారు. అలా మొక్కుకున్న వృద్ధుడి కోసం వీరభద్రుడు రంగంలోకి దిగుతాడు. తర్వాత ఏం జరిగింది. ఆ వీరభద్రుడు వల్ల సమాజంలోను, కోర్ట్ లోనూ సాగే వ్యవహారాలు మారుతాయా..? ఆ వృద్ధుడి కూతురు బ్రతుకుతుందా అనేది మిగతా కథ.

ఎలా ఉంది :

సూర్య మూవీ అంటే మాస్ అండ్ కమర్షియల్ ఎలిమెంట్స్ ఫుల్ గా ఉంటాయి అని చాలామంది భావించారు. ట్రైలర్ లో కూడా అదే కనిపించింది. లాయర్ గా అతను అదరగొడతాడు అని అనుకున్నారు. కానీ ఈ మూవీలో సూర్య పాత్ర ఎక్స్ టెండెడ్ గెస్ట్ రోల్ లాంటి వాడిగా కనిపించాడు. కథంతా ఆర్జే బాలాజీపైనే సాగుతుంది. అవినీతి అయినా అతనే మెయిన్ గా హైలెట్ అవుతూ ఉంటాడు. సినిమా ప్రారంభమైన అరగంట తర్వాతే సూర్య పాత్ర ఎంటర్ అవుతుంది. అక్కడి నుంచి ఫస్ట్ హాఫ్ వరకు బానే ఉంటుంది. వృద్ధుడి పాత్రలోని వేరియేషన్స్ తో సూర్య పాత్ర లాస్ అవుతుంది. అయినా ఇంటర్వెల్ బ్యాంగ్ తో ఆకట్టుకుంటాడు. సెకండ్ పార్ట్ బావుంటుంది అని భావించారు. బట్ సెకండ్ హాఫ్ పూర్తిగా తేలిపోయింది. సూర్య పాత్రలో ఓ లాజిక్ ఉండదు. సంఘర్షణ కనిపించదు. కోర్ట్ రూమ్ డ్రామా గాలికి వదిలేశారు. అతని ప్లేస్ లో త్రిషను తీసుకున్నారు. దీంతో అతని పాత్ర చాలా తేలిపోయింది. అదే పనిగా మాస్ కోసం అంటూ పెట్టిన రెండు పాటలు కూడా ఇరిటేట్ చేస్తాయి. అదే పనిగా అతను దేవుడుగా కనిపించిన సన్నివేశాల్లో బలం లేకపోవడం వల్ల ఇబ్బందిగా మారింది. అదీ కాక కేవలం ఒక లాయర్ తో దేవుడు పోరాటం చేయడం వంటిది మాత్రం అస్సలే మాత్రం సెట్ కాలేదు. దేవుడు లాంటి వాడు ఇలాంటి ఓ చిన్న కోర్ట్ లాయర్ తో తలపడటం అస్సలే మాత్రం సమంజసంగా లేదు. పోనీ అతనేమైనా పూర్తి స్థాయి దేవుడా అంటే అదీ కాదు.. కేవలం ఒక ఏరియాకే దేవుడు అంటాడు. మరి ఇదేం లాజిక్ అనేది తెలియదు. ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ వరకు మొత్తం సిల్లీగా ఉంది. అతను కోరుకున్నప్పుడే మంత్రాలు చేయడం.. ఇతరులు సాయం చేయాలనుకోవడంలో సైలెంట్ అవడం ఏంటో తెలియదు. ఎలా చూసినా ఫస్ట్ హాఫ్ వరకు బానే ఉంది అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ మొత్తం భరించలేనంతగా మారిపోయింది. ఆ కారణంగా వీరభద్రుడు వీరంగం చేసినా కథనంలో దమ్ము లేకపోవడంతో తేలిపోయాడు.

నటన పరంగా సూర్య పాత్రలో ఓకే. బట్ ఇందులో ఏ కొత్తదనం లేదు. నటనలో వేరియేషన్స్ చూపించే ఆస్కారం కూడా లేదు.అందుకే అతను ఓకే అనిపించాడు. త్రిష పాత్ర కూడా అంతే స్థాయిలో సాధారణంగా ఉంది. నిజానికి ఈ మూవీలో ఈ రెండు పాత్రలు ఇమేజ్ కు తగ్గ స్థాయిలో మాత్రం లేవు. ఆర్జే బాలాజీ అంతా తానై ‘నడిపించుకున్నాడు’. నటన బావుంది. వృద్ధుడి పాత్రలో మళయాల నటుడు ఇంద్రన్ అదరగొట్టాడు. జడ్జ్ గా నాట్టీ ఓకే. లాయర్ గా సుప్రీత్ ఫర్వాలేదు. బట్ రొటీన్ రోల్. మిగతా పాత్రలన్నీ ఓకే.

టెక్నికల్ గా సంగీతం మాత్రం అస్సలు బాలేదు. ఈ సంగీత దర్శకుడు సాయి అభ్యంకర్ కోసం ఇచ్చిన బిల్డప్ లు, హైప్ లు మామూలుగా లేవు. బట్ అతని నేపథ్య సంగీతం అనిరుధ్ ను ఫాలో అయ్యాడు తప్ప.. తనదైన కొత్తదనం మాత్రం అస్సలే మాత్రం కనిపించలేదు. పాటలైతే మరీ దారుణంగా ఉన్నాయి. దబిడి దిబిడిగా ఉన్నాయి తప్ప మీనింగ్ ఫుల్ మ్యూజిక్ ఇవ్వలేదు. సినిమాటోగ్రఫీ బానే ఉంది. బట్ కొన్నిసార్లు వాడిన లైటింగ్స్ మాత్రం ఇబ్బంది పెట్టాయి. కథకు తగ్గట్టుగా అని భావించినా ఆ లైటింగ్ బాలేదు. ఎడిటింగ్ లోనూ తప్పులున్నాయి. తెలుగు డబ్బింగ్ యావరేజ్ గా ఉంది. చాలా చోట్ల లిప్ సింక్ లేదు. ప్రొడక్షన్ వాల్యూస్ బానే ఉన్నాయి.

దర్శకుడు ఆర్జే బాలాజీ తీసుకున్న కథలో గొప్పదనం ఉంది. న్యాయం అందరికీ సమానంగా దొరకదు. కోర్ట్ ల్లో లాయర్లు, జడ్జ్ లు కుమ్మక్కయ్యి సామాన్యులను ఎలా వేధించుకు తింటారు.. న్యాయ వ్వవస్థలో ఉన్న చాలా లోపాలు ఎంత దారుణంగా ఉన్నాయి అనే పాయింట్ బలంగా ఉంది. కానీ దాన్ని అంతే బలంగా ప్రజెంట్ చేయడంలో మాత్రం పూర్తిగా విఫలమయ్యాడు.

ఫైనల్ గా : పూర్తిగా తేలిపోయిన, శక్తి లేని వీరభద్రుడు

రేటింగ్ : 2/5

బాబురావు. కామళ్ల

Tags

Next Story