Vikram Movie Review: 'విక్రమ్' మూవీ రివ్యూ.. ఇట్స్ ఏ ఫోర్ మ్యాన్ షో..

Vikram Movie Review: విక్రమ్ మూవీ రివ్యూ.. ఇట్స్ ఏ ఫోర్ మ్యాన్ షో..
X
Vikram Movie Review: లోకేశ్ కనకరాజ్ చెప్పినట్టుగా తాను చేసిన ‘ఖైదీ’ సినిమాకు, విక్రమ్‌కు కనెక్షన్ ఉంది.

Vikram Movie Review: ఇద్దరు హీరోలు మల్టీ స్టారర్ చేస్తేనే.. ఆ సినిమాకు క్రియేట్ అయ్యే హైప్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటిది ముగ్గురు స్టార్ హీరోలు.. అది కూడా ముగ్గురు లెజెండరీ యాక్టర్లు ఒకే ఫ్రేమ్‌లో కనిపించనున్నారంటే.. ఆ సినిమాకు అంచనాలు మామూలుగా ఉండవు. అలాంటి భారీ అంచనాల మధ్య విడుదలయ్యింది కమల్ హాసన్ నటించిన 'విక్రమ్'.


కోలీవుడ్ దర్శకుల్లో తనకంటూ ఓ డిఫరెంట్ మార్క్‌ను క్రియేట్ చేసుకున్నాడు లోకేశ్ కనకరాజ్. ఇప్పటివరకు లోకేశ్ డైరెక్ట్ చేసిన సినిమాలన్నీ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకోవడంతో విక్రమ్‌పై కూడా ప్రేక్షకుల్లో అంచనాలు భారీగానే ఉన్నాయి. పైగా కమల్ హాసన్‌లాంటి సీనియర్ నటుడితో విజయ్ సేతుపతి, ఫాహద్ ఫాజిల్‌లాంటి ఇద్దరు గొప్ప నటులు కలిసి నటించడంతో అక్కడే సినిమా సగం హిట్ అయిపోయిందనే చెప్పాలి.


పోలీస్ ఆఫీసర్ అమర్ పాత్రలో నటించని ఫాహద్ ఫాజిల్.. ఇన్వెస్టిగేషన్ సీన్లతో ఫస్ట్ హాఫ్‌ను పూర్తిగా డామినేట్ చేశాడు. ఫస్ట్ హాఫ్‌లో కమల్ హాసన్ కనిపించేది అక్కడక్కడే అయినా.. ఆయన స్క్రీన్ మీద వచ్చినప్పుడు మాత్రం లోకేశ్‌లోని ఫ్యాన్ బాయ్ బయటికి వచ్చినట్టుగా అనిపిస్తుంది. మాస్టర్‌లో భవాని పాత్రకు, విక్రమ్ సినిమాలో విజయ్ సేతుపతి చేసిన సంతానం పాత్రకు చాలా దగ్గర పోలికలు ఉంటాయి.


లోకేశ్ కనకరాజ్ చెప్పినట్టుగా తాను చేసిన 'ఖైదీ' సినిమాకు, విక్రమ్‌కు కనెక్షన్ ఉంది. ఖైదీ చిత్రం చూడని వాళ్లకు పలు సీన్స్ కనెక్ట్ అవ్వకపోయే అవకాశం కూడా ఉంది. ఇక సినిమాలో ఉన్న నెగిటివ్స్ విషయానికొస్తే.. విక్రమ్ యాక్షన్ సీన్స్ కొంతమందికి హై ఇచ్చినా.. పూర్తిస్థాయి యాక్షన్ నచ్చనివారికి కాస్త బోరింగ్ అనిపించవచ్చు.


విక్రమ్‌లో అతిపెద్ద పాజిటివ్ సూర్య గెస్ట్ రోల్. 5 నిమిషాలే స్క్రీన్‌పై కనిపించినా కూడా సూర్య పాత్ర సినిమాకు ప్రాణం. విక్రమ్‌లో మరో పెద్ద పాజిటివ్ విషయం అనిరుధ్ మ్యూజిక్. తన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌తో అనిరుధ్ ఎప్పుడూ నిరాశపరచాడు. విక్రమ్‌లో కూడా అంతే కానీ.. ఈ సినిమాలో ప్రత్యేకంగా హాలీవుడ్ రేంజ్ మ్యూజిక్‌ను అందించాడు అనిరుధ్. యాక్షన్ సీన్స్‌లో అనిరుధ్ ర్యాప్ సాంగ్స్ హైలెట్‌గా నిలిచాయి.

Tags

Next Story