Vikrant Rona Review: 'విక్రాంత్ రోణ' రివ్యూ.. 3డీ యాక్షన్ డ్రామా..

Vikrant Rona Review: విక్రాంత్ రోణ రివ్యూ.. 3డీ యాక్షన్ డ్రామా..
Vikrant Rona Review: విక్రాంత్ రోణ చిత్రాన్ని రూ.100 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించాడు దర్శకుడు అనూప్ బంఢారీ.

Vikrant Rona Review: ప్రస్తుతం సినీ పరిశ్రమలో పాన్ ఇండియా చిత్రాల ట్రెండ్ నడుస్తోంది. ప్రతీ భాషలోని మేకర్స్ పాన్ ఇండియా సినిమాలను తెరకెక్కించడానికి ఆసక్తి చూపిస్తున్నారు. అలాగే 'కేజీఎఫ్'తో తాము కూడా పాన్ ఇండియా చిత్రాలు తెరకెక్కించగలమని నిరూపించిన శాండిల్‌వుడ్.. మరో పాన్ ఇండియా చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అదే 'విక్రాంత్ రోణ'. ఈ శుక్రవారం థియేటర్లలో విడుదలయిన విక్రాంత్ రోణ.. ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించగలిగింది..?

కథ

ఓ ఊళ్లో చిన్నపిల్లలంతా చనిపోతూ శవాల్లాగా చెట్లకు వేలాడుతూ ఉంటారు. ఆ కేసును విచారించడానికి వచ్చిన పోలీస్ ఆఫీసర్‌కు కూడా అదే గతి పడుతుంది. ఆ పోలీస్ ఆఫీసర్ ప్లేసులో ఇన్వెస్టిగేషన్ చేయడానికి వస్తాడు విక్రాంత్ రోణ (సుదీప్‌). చిన్న పిల్లలందరినీ దెయ్యాలే ఎత్తుకెళ్లి చంపేస్తున్నాయని ఊరి జనం నమ్మడం మొదలుపెడతారు. ఇంతకీ ఆ ఊరు మిస్టరీ ఏంటి? దానిని సుదీప్ ఎలా కనిపెడతాడు? అనేదే కథ.

విశ్లేషణ

విక్రాంత్ రోణ చిత్రాన్ని రూ.100 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించాడు దర్శకుడు అనూప్ బంఢారీ. ఈ బడ్జెట్‌లో విజువల్స్‌ను అద్భుతంగా చూపించాడు. విక్రాంత్ రోణ చిత్రానికి విజువల్సే హైలెట్ అని ప్రేక్షకులు ప్రశంసలు కురిపిస్తున్నాడు. ఇదొక యాక్షన్ డ్రామాగా తెరకెక్కినా కూడా 3డీ లో ఈ చిత్రాన్ని చూడడం ఒక మంచి అనుభూతి అంటున్నారు. మొత్తానికి విక్రాంత్ రోణ మొదటి రోజు పాజిటివ్ రివ్యూలను సంపాదించుకుంది.


Tags

Read MoreRead Less
Next Story