Virgin Boys Review : రివ్యూ : వర్జిన్ బాయ్స్

రివ్యూ : వర్జిన్ బాయ్స్
ఆర్టిస్ట్స్ : శ్రీహాన్, రోనిత్ రెడ్డి, గీతానంద్,కౌశల్, మిత్రా శర్మ,అన్షులా ధావన్, జెన్నీఫర్ ఇమ్మానుయేల్ తదితరులు
ఎడిటర్ : మార్తాండ్ కే వెంకటేష్
సంగీతం : సమరన్
కెమెరా : వెంకట్ ప్రసాద్
నిర్మాత : రాజా దారపునేని
దర్శకత్వం : దయానంద్ గడ్డం
చిన్న సినిమాలు పెద్ద విజయాలు సాధించిన సందర్భాలు చాలానే ఉన్నాయి. కాస్త అడల్ట్ కామెడీలా అనిపిస్తూ.. వైవిధ్యమైన ప్రమోషన్స్ తో చిన్న సినిమాగా ఆకట్టుకుంది వర్జిన్ బాయ్స్. యూత్ టార్గెట్ గా చేసిన ప్రమోషన్స్ తో ఆడియన్స్ ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉంది అనేది చూద్దాం..
కథ :
ఇదో కాలేజ్ కథ.యూనివర్శీటీలో చదివే డుండీ, ఆర్య, రోనీలకు అందరిలాగా గాళ్ ఫ్రెండ్స్ ఉండరు. వారి మరో స్నేహితుడు వీరిని హేళన చేస్తూ తను అమెరికా నుంచి వచ్చే లోగా అందరూ వర్జినిటీ కోల్పోవాలి అని ఛాలెంజ్ చేస్తాడు.దీంతో ఆ ముగ్గురు కుర్రాళ్లు వరుసగా జెనీఫర్, సరయు, శ్లోక అనే అమ్మాయిలతో ప్రేమలో పడతారు. కానీ ఈ లవ్ లైఫ్ లో బోలెడు ప్రాబ్లమ్స్. మరోవైపు అబ్బాయిలు ప్రేమకంటే తమ వర్జినిటీ కోల్పోవాలి అనే తాపత్రయంతోనే ఎక్కువగా ఉంటారు. వీరి ప్రేమకథల్లో ప్రాబ్లమ్స్ రావడానికి ఇదే అసలు కారణం. మరి వీరు అనుకున్నట్టుగా వర్జినిటీ కోల్పోయారా..ప్రేమనైనా గెలుచుకున్నారా లేదా అనేది మిగతా కథ.
ఎలా ఉంది :
వర్జిన్ బాయ్స్ మూవీ ట్రైలర్ చూడగానే ఇదో అడల్ట్ కామెడీ మూవీ అని అర్థం అయింది. పోస్టర్స్ సైతం అందుకు తగ్గట్టుగానే కనిపించాయి. సో.. ఆడియన్స్ కు తాము ఏం చెప్పబోతున్నాము అనే విషయంలో ముందే ప్రిపేర్ చేశారు. కథగా చూస్తే పెద్దగా కొత్తదనం కనిపించదు. కానీ అడల్ట్ జోక్స్ ను ఇష్టపడే వారి కోసం అనేకం రాసుకున్నారు. అలాగే స్కిన్ షో కూడా బాగానే ఉంది. ఓ రకంగా ఇలాంటి కథలను కాస్త పకడ్బందీ స్క్రీన్ ప్లేగా రాసుకుంటే బాగా చెప్పొచ్చు. ఈ విషయంలో దర్శకుడు తడబడ్డాడు.ముఖ్యంగా "ప్రేమ ముఖ్యమే అయినా సెక్స్ కు కూడా ప్రేమే ఆధారం" అని చెప్పాలనుకున్నాడు దర్శకుడు. ఈ పాయింట్ ను అక్కడక్కడా అడల్ట్ జోక్స్ తో మొదలుపెట్టి.. ఆ తర్వాత ఎమోషనల్ గా టర్న్ చేయొచ్చు. లవ్ స్టోరీలో మంచి కాన్ ఫ్లిక్స్ క్రియేట్ చేయొచ్చు. అలా జరగలేదు.
అయినా సినిమా బోర్ కొట్టదు. ముందే ప్రిపేర్ చేయడం వల్ల అడల్ట్ కామెడీని ఎంజాయ్ చేసే వారికి, యూత్ కు బాగా కనెక్ట్ అయ్యే అవకాశాలున్నాయి. ఈ తరహా కథలకు కావాల్సిన అన్ని ఎలిమెంట్స్ కనిపిస్తాయి. ఆ కారణంగా కొన్ని మైనస్ లు ఉన్నా.. ఎంటర్టైన్ చేయడంలో విజయం సాధించారు అనే చెప్పాలి. ముఖ్యంగా చివరి 20 నిమిషాల పాటు అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే అంశాలతో అలరిచారు. ఇదే సినిమాకు మెయిన్ హైలెట్ గా నిలిచే అవకాశం ఉందని చెప్పొచ్చు.
ప్రధాన పాత్రల్ల నటించిన శ్రీహాన్ష్, గీతానంద్, రోనిత్ రెడ్డి మంచి హుషారుగా నటించారు. వీరికి జోడీలుగా కనిపించిన జెన్నీఫర్, మిత్రా శర్మ, అన్షులా అవసరానికి తగ్గట్టుగా అందాలారబోతతో ఆకట్టుకున్నారు. నటన పరంగానూ మెప్పించారు. ఇతర పాత్రల్లో మధుమణి కొడుకు నెగెటివ్ షేడ్ ఉన్న క్యారెక్టర్ లో మెప్పించాడు. బంచిక్ బబ్లూ మెరిశాడు.
టెక్నికల్ గా చూస్తే మ్యూజిక్ సినిమాకు ఎసెట్. సినిమాటోగ్రఫీ బ్యూటీఫుల్ గా ఉంది. డబ్బింగ్ విషయంలో ఇంకాస్త శ్రద్ధ పెట్టి ఉంటే బావుండేది. డైలాగ్స్ కథకు తగ్గట్టుగా కనిపిస్తాయి. ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్ గా కనిపించాయి. దర్శకుడు కథతో పాటు స్క్రీన్ ప్లే ఇంకాస్త ఎక్కువ శ్రద్ధ పెట్టి ఉంటే ఇంకాస్త బెటర్ అవుట్ పుట్ వచ్చేది. అయినా అతని టార్గెట్ ఆడియన్స్ ను మెప్పించే అన్ని అంశాలతో చాలా వరకూ ఓకే అనిపించాడు.
ఫైనల్ గా : వర్జిన్ బాయ్స్ .. ఎంటర్టైన్ చేశారు
రేటింగ్ : 2.75/5
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com