Vishnu Vinyasam Movie Review : విష్ణు విన్యాసం మూవీ రివ్యూ

రివ్యూ : విష్ణు విన్యాసం
ఆర్టిస్ట్స్ : శ్రీ విష్ణు, నయన్ సారిక, సత్య, మురళీ శర్మ, బ్రహ్మాజీ, ప్రవీణ్, సత్యం రాజేష్, శ్రీనివాసరెడ్డి తదితరులు
ఎడిటర్ : కార్తికేయన్ రోహిణి
సంగీతం : రధన్
సినిమాటోగ్రఫీ : సాయి శ్రీరామ్
నిర్మాత : సుమంత్ నాయుడు జి
దర్శకుడు : యదునాథ్ మారుతిరావు
శ్రీ విష్ణు ఈ మధ్య వరుసగా మూవీస్ చేస్తున్నాడు. మాగ్జిమం విజయాలు సాధిస్తున్నాడు. మినిమం రేంజ్ లోనే మూవీస్ తో ఆకట్టుకుంటున్నాడు. తన లేటెస్ట్ మూవీ విష్ణు విన్యాసం. ఈ మూవీకి మంచి ప్రమోషన్స్ కూడా చేశాడు. నయన్ సారిక హీరోయిన్ గా నటించింది. మరి ఈ మూవీ ఎలా ఉంది అనేది ఈ రివ్యూలో చూద్దాం.
కథ :
విష్ణు( శ్రీ విష్ణు) ఓ కాలేజ్ లో జూనియర్ లెక్చరర్ గా పనిచేస్తుంటాడు. అతనో జాతకాల పిచ్చోడు. న్యూమరాలజీని ప్రతి విషయంలో ఫాలో అవుతుంటాడు. అయితే అతను సీనియర్ లెక్చరర్ అవ్వాలనే ప్రయత్నాల్లో ఉంటాడు. అందుకు కొందరు అడ్డు పడుతుంటారు. అలా అడ్డుపడే వారిని కాదని మనీషా( నయన్ సారిక) అతన్ని తనకింద జూనియర్ గా తీసుకుంటుంది. కానీ అదో టైప్. తొలి రోజే అతన్ని సిగరెట్ అడుగుతుంది. సాయంత్రం మందు తెప్పించుకుంటుంది. అంతే కాదు.. అతన్ని లిప్ కిస్ కూడా అడుగుతుంది. అందుకు ఓ కారణం కూడా ఉంటుంది. అయితే కొన్ని రోజుల్లో అతను ఆమెకు పడిపోతాడు. అది కూడా న్యూమరాలజీలో నెంబర్స్ కలవడంతో. ఇద్దరూ ప్రేమలో పడతారు. కానీ ఆమె జాతకంలో ఓ దోషం ఉంటుంది. ఆమెకు ఇద్దరు భర్తలు ఉంటారనీ.. అందులో మొదటి భర్త పెళ్లైన ఆరు నెలల్లోనే చనిపోతాడు అని జాతకంలో ఉంటుంది. ఈ విషయం విష్ణుకు కూడా తెలుస్తుంది. మరి ఇద్దరు పెళ్లి చేసుకుంటారా.. అసలు ఈ జాతకాల్లో నిజం ఉంటుందా అనేది మిగతా కథ.
ఎలా ఉంది :
ఈ మూవీ కథలో కొత్తదనం ఉంటుందా అంటే పెద్దగా లేదు అని చెప్పాలి. కాకపోతే కథనంతో కొంతవరకు ఆకట్టుకుంటుంది. ప్రధానంగా సినిమా అంతా ఆ ఇద్దరి మధ్యే సాగడం కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. సినిమాలో ఓ సంఘర్షణకు అవకాశం ఉంది. కానీ అది కూడా లైట్ తీసుకుంటూ కామెడీ చేయడం కొంత వరకు ఇబ్బంది పెడుతుంది. అయితే శ్రీ విష్ణు తన టైమింగ్ తో మాగ్జిమం మెప్పించాడు. ఇన్ని మైనస్ లను ప్లస్ చేసే ప్రయత్నం చేస్తాడు. దీంతో సినిమా చాలా వరకూ మెప్పించే అవకాశాలున్నాయి. హీరోయిన్ నయన్ సారిక టైమింగ్ బావుంది. పాత్ర కూడా ఆకట్టుకుంటుంది. తన నటనలో కొత్తదనం లేకపోయినా సన్నివేశాలకు తగ్గట్టుగా తను ప్రవర్తించే విధానం మెప్పిస్తుంది. తన మొదటి భర్త చనిపోతాడు అని తెలిసి కూడా ప్రేమించిన వాడితోనే పెళ్లికి సిద్ధం కావడం.. అటు హీరో కూడా తను చనిపోతాడు అని తెలిసే పెళ్లికి సిద్ధం కావడం.. ఆ క్రమంలో వచ్చే సన్నివేశాల్లో ఆమె విషం తాగినట్టుగా ఓ సీన్ ఉంటుంది. బట్ ఆ సీన్ కంటిన్యూ కావడం మైనస్ లా ఉంది. ఇద్దరి పెళ్ళి రోజునే అతనిపై హత్యా ప్రయత్నం చేయడం, ఈ సీన్ లో కొంత ల్యాగ్ చేసినట్టు కనిపిస్తుంది. తర్వాత వచ్చే అన్ని సీన్స్ కూడా ఒకటికి మించి ఒకటిగా ఉంటుంది. క్లైమాక్స్ లో హీరోయిన్ పేరెంట్స్ విషయంలో ఓ ట్విస్ట్ ఉండటం కొంత వరకు బావుంటుంది. ఓవరాల్ గా చూస్తే విష్ణు విన్యాసం మెప్పించే అవకాశాలున్నాయి.
నటన పరంగా శ్రీ విష్ణు ఎప్పట్లానే ఎనర్జిటిక్ గా కనిపించాడు. టైమింగ్ బావుంది కానీ.. అన్ని సినిమాల్లో ఒకేలా డైలాగ్స్ చెప్పడం బాలేదు. ఈ మూవీలో అది కాస్త ఓవర్ అయింది. ఇకపై అదే టైమింగ్ లో డైలాగ్స్ చెప్పడం తగ్గించుకుంటే బెటర్. హీరోయిన్ బావుంది. బాగా చేసింది. సత్య పాత్ర ఉన్నా.. అతని కామెడీ పండలేదు. శ్రీకాంత్ అయ్యంగార్, శ్రీనివాస రెడ్డి, మురళీ శర్మ పాత్రలు బాగానే ఉన్నాయి. మిగతా పాత్రలన్నీ రొటీన్.
టెక్నికల్ గా చూస్తే మ్యూజిక్ మైనస్. పాటలు బాలేదు. నేపథ్య సంగీతం కూడా మెప్పించలేదు. సినిమాటోగ్రఫీ బానే ఉంది. ఎడిటింగ్ చూస్తే సినిమా కేవలం 2 గంటల7 నిమిషాలే ఉంది కాబట్టి బాగా సెట్ అయినట్టే. సి.జి వర్క్స్ తేలిపోయాయి. ప్రొడక్షన్ వాల్యూస్ బానే ఉన్నాయి. దర్శకుడు యదునాథ్ మారుతిరావు దర్శకత్వం పరంగా ఉంటే ఏ మ్యాజిక్ లు చేయలేదు. చాలా సీన్స్ చాలా సినిమాల్లో ఉన్నట్టుగా ఉన్నాయి. రొటీన్ స్టోరీ. అయితే అక్కడక్కడా నవ్వులు పంచే విధంగా కథనం కనిపిస్తుంది.
ఫైనల్ గా : సగం వినోదాత్మక విన్యాసం
రేటింగ్ : 2.5/5
బాబురావు కామళ్ల
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
