War 2 Complete Review : హిట్టా ఫట్టా... రివ్యూ : వార్ 2

War 2 Complete Review :  హిట్టా ఫట్టా... రివ్యూ : వార్ 2
X

రివ్యూ : వార్ 2

ఆర్టిస్ట్స్ : హృతిక్ రోషన్, ఎన్టీఆర్, కియారా అద్వానీ, అనిల్ కపూర్, అషుతోష్ రాణా, వరుణ్ బడోలా తదితరులు

ఎడిటర్ : ఆరిఫ్ షేక్

బ్యాక్ గ్రౌండ్ స్కోర్ : సంచిత్ బల్హారా, అంకిత్ బల్హారా

పాటలు : ప్రీతమ్

సినిమాటోగ్రఫీ : బెంజిమన్ ప్రీతమ్

నిర్మాత : ఆదిత్య చోప్రా

దర్శకత్వం : అయాన్ ముఖర్జీ

వార్ 2.. కొన్ని రోజులుగా హాట్ టాపిక్ గా ఉన్న మూవీ. ఎన్టీఆర్ బాలీవుడ్ డెబ్యూ మూవీ కావడం.. యశ్ రాజ్ ఫిల్మ్స్ స్పైవర్స్ లో భాగంగా రూపొందిన సినిమా కావడంతో తెలుగు ప్రేక్షకుల్లో అంచనాలున్నాయి. పెద్దగా ప్రమోషన్స్ చేయకపోయినా.. ఎన్టీఆర్ ఫ్యాన్స్ లో ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. మరి ఆ అంచనాలను వార్ 2 అందుకుందా లేదా అనేది చూద్దాం.

కథ :

కబీర్ (హృతిక్ రోషన్) ‘రా’ ఏజెంట్ గా పని చేసి తప్పుకుంటాడు. రా కు, దేశానికి వ్యతిరేకంగా ఉన్న ‘కలి’ అనే గ్రూప్ తో చేతులు కలిపి హత్యలు చేస్తుంటాడు. ఈ క్రమంలో తన గురువు, మెంటార్ అయినా రా చీఫ్ సునీల్ లూథ్రా(అషుతోష్ రాణా) ను చంపేస్తాడు. ఈ హత్యను సీరియస్ గా తీసుకున్న రా .. అతన్ని అంతం చేసేందుకు మరో ఏజెంట్ అయిన విక్రమ్ (ఎన్టీఆర్) ను రంగంలోకి దించుతుంది. కబీర్ కు ఏ మాత్రం తీసిపోని ధైర్య సాహసాలున్న విక్రమ్ అతన్ని పట్టుకున్నాడా.. ఈ ఇద్దరి మధ్య ఉన్న సంఘర్షణ ఏంటీ..? లూథ్రాను కబీర్ ఎందుకు చంపాడు.. అసలు కలి అనే ముఠా వెనక ఉన్నది ఎవరు..? వారి వల్ల దేశానికి ఉన్న ప్రమాదం ఏంటీ అనేది మిగతా కథ.

ఎలా ఉంది :

స్పై, ఏజెంట్స్ మూవీస్ అన్నీ మాగ్జిమం ఒక టెంప్లేట్ లో సాగుతుంటాయి. శతృదేశాలు మన దేశంపై దాడి చేయాలని ప్రయత్నిస్తుంటాయి. వాటిని మన ‘ది బెస్ట్ ఏజెంట్స్’ఆ ప్రయత్నాలను ఛేధించడం. ఈ క్రమంలో ఎత్తులు, పై ఎత్తులు, ఛేంజింగ్ లు, మైండ్ గేమ్ లు, కళ్లు చెదిరే పోరాటలు కామన్ గా చూస్తుంటాం. ఇప్పటి వరకూ యశ్ రాజ్ ఫిల్మ్స్ లోని స్పై వర్స్ లో వచ్చిన మూవీస్ అలాగే ఉన్నాయి. కానీ వార్ 2 అలా లేదు. కేవలం హీరోల ఇమేజ్ లను, వారి స్క్రీన్ ప్రెజెన్స్ టైమ్ కోసమే ఎక్కువ ఫోకస్ చేశారు. ఇమేజ్ లకు తగ్గట్టుగా హీరోల అభిమానులను శాటిస్ ఫై చేయాలనుకున్నాడు దర్శకుడు అయాన్ ముఖర్జీ. దీంతో ఈ స్పై లు ఇద్దరూ పర్సనల్ ఇగోస్ తో ఆడియన్స్ ను ఇబ్బంది పెట్టినట్టు కనిపిస్తుంది.

హృతిక్ రోషన్ ఎంట్రీ అయిన అరగంట తర్వాత ఎన్టీఆర్ ఎంట్రీ ఉంది. ఇద్దరి క్యారెక్టర్స్ ను బాగా పరిచయం చేసినా.. ఎన్టీఆర్ ఇంటర్ డక్షన్ ఇంకాస్త బావుంది. ఇక అప్పటి నుంచి కబీర్ ను పట్టుకోవడానికి విక్రమ్ ఎత్తులు పై ఎత్తులు వేయడం.. ఆ క్రమంలో వచ్చే నాన్ స్టాప్ ఛేజింగ్, ట్రైన్ ఎపిసోడ్స్ చాలాసార్లు హాలీవుడ్ సినిమాల్లో చూసినట్టుగానే ఉన్నాయి తప్ప కొత్తగా అనిపించవు.

కబీర్ ను చంపడమే లక్ష్యంగా వెళ్లిన విక్రమ్ చాలా త్వరగా అతనికి ‘ఫ్రెండ్’అయిపోతాడు. దీంతో ఇక ఇంటర్వెల్ తర్వాత ఇద్దరూ కలిసి శతృమూకల పని పడతారు అనుకుంటాం. బట్ ఇంటర్వెల్ బ్యాంగ్ తో అదిరిపోయే ట్విస్ట్ ఇచ్చాడు. ఆ ట్విస్ట్ ను ఎలా కంటిన్యూ చేస్తారా అనుకుంటే సెకండ్ హాఫ్ స్టార్టింగ్ లోనే సుదీర్ఘమైన చైల్డ్ ఎపిసోడ్. అది మరీ సాగదీసినట్టుగా అనిపిస్తుంది. ఆపై కథనం ఎమోషనల్ గా టర్న్ అవుతుంది. స్నేహితులే శతృవులు కావడం.. పాత్రలూ మారిపోవడం.. క్లైమాక్స్ ను ఊహించినట్టుగానే ఉన్నా.. సముద్రంలో ఛేజింగ్ మాత్రం అవసరమా అనిపిస్తుంది. అలాగే మంచు కొండల్లో క్లైమాక్స్ ఫైట్ పెట్టడం అనేది ఏంటో వారికే తెలియాలి. ఇక ‘కలి’టీమ్ ప్లాన్ ఏంటీ..? వాళ్లు ఎందుకు ఇండియానే టార్గెట్ చేశారు అనే పాయింట్ ఇంకాస్త వివరంగా చెప్పి ఉంటే బావుండేది. అయితే సినిమాలో చాలా ఇల్లాజికల్ సీన్స్ ఉన్నా.. చూస్తున్నంత సేపూ బోర్ కొట్టదు. ఈ మేరకు ఓకే అనిపిస్తుంది. లాజిక్ ల జోలికి వెళ్లకుండా.. కథ గురించి ఆరాలు తీయకుండా కామ్ గా తెరపై కదలుతున్న బొమ్మలు చూస్తూ ఉంటే ఓకే అనిపించేస్తుంది. కానీ అదేంటో ఆమిర్ పేట నుంచి కూకట్ పల్లి వెళ్లినంత సులువుగా వీళ్లు ఒక్కో సీన్ కు ఒక్కో దేశంలో కనిపిస్తుంటారు. అవసరం లేకపోయినా అలాంటి సీన్స్ చాలా ఉన్నాయి.

నటన పరంగా చూస్తే హృతిక్, ఎన్టీఆర్ ఇద్దరూ పోటా పోటీగా నటించారు. ఈ తరహా పాత్ర ఎన్టీఆర్ కు ఫస్ట్ టైమ్. అయినా బాగా చేశాడు. హృతిక్ ఆల్రెడీ ఈ పాత్రలు చేసి ఉన్నాడు. కియారా ఓకే. అషుతోష్ రాణా, అనిల్ కపూర్ బాగా చేశారు. మిగతా వారిలో మరీ గుర్తుంచుకునేంత పాత్రలేం లేవు.

టెక్నికల్ గా సినిమాటోగ్రఫీ బ్రిలియంట్ గా ఉంది. నేపథ్య సంగీతం ఓకే. పాటలూ అంతంతే. ఎడిటింగ్ పరంగా ఇంకా ట్రిమ్ చేయొచ్చు. విఎఫ్ఎక్స్, గ్రాఫిక్స్ బాగా తెలిసిపోతున్నాయి. క్వాలిటీ పరంగా ఇంకాస్త జాగ్రత్తగా ఉండాల్సింది. ప్రొడక్షన్ వాల్యూస్ బావున్నాయి. తెలుగు డబ్బింగ్ బావుంది. దర్శకుడుగా అయాన్ ముఖర్జీ హీరోలపై ఎక్కువ ఫోకస్ చేసి కథ, కథనాలపై పట్టు కోల్పోయాడు.

ఫైనల్ గా : వార్ 2 - లాజిక్స్ వదిలేస్తే ఓకే

రేటింగ్ : 2.75/5

- బాబురావు కామళ్ల

Tags

Next Story