Zombie Reddy Review : జాంబిరెడ్డి రివ్యూ!
ప్రశాంత్ వర్మ తొలి చిత్రం ‘అ’ తోనే తన వైవిధ్యాన్ని చూపించాడు. కల్కి తో మరోసారి స్టైలిష్ మేకింగ్ తో ఆకట్టుకున్నాడు. ఈసారి తెలుగు తెరకు జాంబిలను తెచ్చాడు..

చిత్రం : జాంబిరెడ్డి
విడుదల తేదీ : ఫిబ్రవరి 05, 2021
నటీనటులు : తేజ సజ్జా, ఆనందీ, దక్ష నగర్కర్, రఘు బాబు, గెటప్ శ్రీను, హర్షవర్ధన్, హేమంత్, హరి తేజ.
దర్శకత్వం : ప్రశాంత్ వర్మ
నిర్మాతలు : రాజ్ శేఖర్ వర్మ
సంగీతం : మార్క్ కె రాబిన్
సినిమాటోగ్రఫీ : అనిత్
ఎడిటింగ్ : సాయి బాబు
ప్రశాంత్ వర్మ తొలి చిత్రం 'అ' తోనే తన వైవిధ్యాన్ని చూపించాడు. కల్కి తో మరోసారి స్టైలిష్ మేకింగ్ తో ఆకట్టుకున్నాడు. ఈసారి తెలుగు తెరకు జాంబిలను తెచ్చాడు.. హాలీవుడ్ లో మెప్పించిన ఈ జాంబీలు తెలుగులో ఎలాంటి ఎంటర్ టైన్మెంట్ అందించారో చూద్దాం..
కథ :
మ్యారియో (తేజా సజ్జా) ఒక గేమ్ డిజైనర్ .. తన టీంతో కలసి ఒక గేమ్ ని డిజైన్ చేస్తాడు.. అందులో ఒక ప్రాబ్లమ్ వస్తుంది.. ఆ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేసే టీం మెంబర్ పెళ్ళి చేసుకోవడానికి కర్నూల్ వెళతాడు.. ఆ టీం మెంబర్ కోసం మ్యారియో మిగిలిన టీం తో కర్నూల్ వెళతాడు.. వెళ్ళే దారిలో మ్యారియో ఫ్రెండ్ జాంబీ వైరస్ కి ఎక్కుతుంది.. అది మెల్లగా ఆ ఊరంతా వస్తుంది.. ఎదుట మనిషిని కొరికి రక్తం తాగాలనిపించే ఆ వ్యాది బారిన ఊరంతా పడుతుంది.. మరి మ్యారియో తన టీంతో ఊరినుండి ఎలా బయటపడతాడు..? అక్కడ అతనికి ఎదరైన మరో సమస్య ఏంటి అనేది మిగిలిన కథ..?
కథనం:
లాక్ డౌన్ లో ఎనౌన్స్ చేసి ఆ టైం లో షూట్ చేసినా క్వాలిటీ విషయంలో ప్రశాంత్ వర్మ ఎక్కడా రాజీ పడలేదు.. హీరోగా తేజా సజ్జ నటన బాగుంది.. చైల్డ్ ఆర్టిస్ట్ అవడంతో అతనిఈజ్ చాలా బాగుంది.. సినిమా లో ఎలివేషన్స్ .. వైరస్ ని ఎస్టాబ్లిష్ చేసే సన్నివేశాలు చాలా బాగున్నాయి.. జాంబి అనేది కొత్త గా ఉన్నసీమ లో రెగ్యులర్ గా కనిపించే కథనే ప్రశాంత్ వర్మ ఎంచుకున్నాడు.. కానీ ఆకథలను చాలా కామిక్ వేలో ప్రజెంట్ చేసాడు.. ఆనంది స్ర్కీన్ ప్రజెన్స్ చాలా బాగుంది.. ఒక మంచి నటిని తెలుగు తెర మిస్ అవుతున్నామని పించింది.
సినిమా మొదలైన దగ్గర నుండి ప్రేక్షకుల్ని ఎంటర్ టైన్ చేయడంలో ప్రశాంత్ వర్మ ఎక్కడా రిలాక్స్ అవలేదు.. తేజ కర్నూల్ ఎంటరయిన దగ్గర నుండి కథ మరింత వినోదంగా మారింది.. సీమ మూర్ఖత్వాలను. అక్కడ పగలను చాలా సటైరికల్ గా మార్చాడు ప్రశాంత్ వర్మ.. హరితేజ నీలాంబరి క్యారెక్టర్ నుండి ప్రతి పాత్ర కూడా సరదాగానే సాగుతుంది.. ఎంచుకున్న నేపథ్యం కొత్తది అవడంతో కొత్త సన్నివేశాలకు అవకాశం దొరికింది. అన్నపూర్ణమ్మ తో గెటప్ సీన్ చేసిన కామెడీ చాలా సరదాగా ఉంది.. గెటప్ శ్రీను కు మంచి బ్రేక్ వచ్చిందనిపించింది. దక్ష స్ర్కీన్ ప్రజెన్స్ చాలా బాగుంది.
ఇంకా సినిమా మర్క్ కె రాబిన్ బ్యాగ్రౌండ్ స్కోర్ చాలా ప్రత్యేకంగా నిలుస్తుంది.. జాంబి ల సినిమా అయినా అందులో కొన్ని ఎమోషన్స్ ని పండించాడు.. స్నేహితుడ్ని చంపాల్సి వచ్చినప్పుడు.. ఆనందిని కాపాడే సన్నివేశంలో కొన్ని ఎమోషన్స్ పండాయి..సరదాగా సాగే కథా కథనాలతో కొత్త కాన్సెప్ట్ ని బాగా మోల్డ్ చేసాడు దర్శకుడు.. సరదాగా సాగే కథనం.. అక్కడక్కడా థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో జాంబిరెడ్డి ఆకట్టుకున్నాడు..
చివరిగా: హార్రర్ కామెడీ రోటీన్ అయిన ప్రేక్షకులకు జాంబిరెడ్డి కొత్తగా అనిపిస్తాడు.. జాంబి జానర్ ఎంటర్ టైన్మెంట్ ని అందించడంలో జాంబిరెడ్డి సక్సెస్ అయ్యాడు..
RELATED STORIES
Rajinikanth : తన పొలిటికల్ ఎంట్రీపై రజినీ ఏమన్నారంటే..?
8 Aug 2022 3:31 PM GMTNachindi Girl Friendu : దోస్త్ అంటే నువ్వేరా సాంగ్‌ను రిలీజ్ చేసిన...
8 Aug 2022 2:01 PM GMTHansika Motwani : హన్సిక వయసెంతో తెలుసా..?
8 Aug 2022 12:01 PM GMTDulquer Salmaan: హీరోగా చేస్తానంటే పరువుతీయొద్దన్నారు: దుల్కర్
8 Aug 2022 10:53 AM GMTRashmika Mandanna: అక్కినేని హీరోతో రష్మిక రొమాన్స్..
8 Aug 2022 7:34 AM GMTKrithi Shetty: అందుకే బాలీవుడ్ ఆఫర్లు వదులుకున్నా: కృతి శెట్టి
8 Aug 2022 6:02 AM GMT