Viveka Murder Case: సీబీఐ విచారణకు హాజరైన ఎంపీ అవినాష్‌రెడ్డి

మరోసారి సీబీఐ విచారణకు హాజరు అయ్యారు కడప ఎంపీ అవినాష్‌రెడ్డి. వివేకా హత్య కేసులో అవినాష్‌రెడ్డిని సీబీఐ విచారిస్తోంది. ప్రతి శనివారం సీబీఐ విచారణకు హాజరుకావాలని..ముందస్తు బెయిల్ తీర్పులో తెలంగాణ హై కోర్టు ఆదేశించింది. శనివారంతో పాటు మిగిలిన రోజుల్లో విచారణ చేయాలనుకుంటే..నోటీసులు ఇచ్చి విచారణ చేసుకోవచ్చని సీబీఐకి ఆదేశించింది కోర్టు.
ఇటీవల అవినాష్ ముందస్తు బెయిల్ పిటిషన్ పై వాదనలు వినిపించిన సీబీఐ తరపున న్యాయవాది.. అవినాష్‌రెడ్డి సీబీఐకి విచారణకు సహకరించడం లేదని హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు.. ఎన్నిసార్లు నోటీసులు ఇచ్చినా అవినాష్‌రెడ్డి ఏదో సాకు చూపి తప్పించుకున్నాడని తెలిపారు.. ఇక, వైఎస్ వివేకా హత్యకు నెలరోజుల ముందే కుట్ర జరిగిందన్న సీబీఐ లాయర్.. వివేకా హత్య వెనుక రాజకీయ కారణం ఉందని వాదించారు.
కొన్ని స్టేట్‌మెంట్‌లను సీల్డ్ కవర్‌లో కోర్టుకు సమర్పిస్తామన్న సీబీఐ విజ్ఞప్తిని హైకోర్టు తిరస్కరించింది. పిటిషనర్ తరుపు వారికి స్టేట్‌మెంట్ గురించి తెలుసుకునే హక్కు ఉందన్న హై కోర్టు..అవతలి పార్టీకి సమాచారం లేకుండా కేవలం కోర్ట్ లే స్టేట్‌మెంట్..చదివేలా ఉన్న జడ్జిమెంట్ ఏమైనా ఉన్నాయా అని సీబీఐని ప్రశ్నించింది.అలాగే అవినాష్ రెడ్డి సాక్షులను బెదిరించినట్లు ఏమైనా ఫిర్యాదులు అందాయా అని ప్రశ్నించిన కోర్టుకు అవినాష్ రెడ్డికి వ్యతిరేకంగా స్టేట్‌మెంట్ ఇవ్వడానికి సాక్షులు..ముందుకు రావడం లేదని, అతను చాలా ప్రభావిత వ్యక్తి అని సమాధానం ఇచ్చారు సీబీఐ తరపు లాయర్. అయితే తెలంగాణ హై కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ ప్రతి శనివారం సీబీఐ విచారణకు హాజరుకావాలని..ఆదేశించింది.శనివారంతో పాటు మిగిలిన రోజుల్లో విచారణ చేయాలనుకుంటే.. నోటీసులు ఇచ్చి విచారణ చేసుకోవచ్చని సీబీఐకి ఆదేశాలు జారీ చేసింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com