ఆటో చార్జీలు చెల్లించనందుకు... ప్రయాణికుడిపై ఆటోడ్రైవర్ లైంగిక దాడి..!

ఆటో చార్జీలు చెల్లించనందుకు... ప్రయాణికుడిపై ఆటోడ్రైవర్ లైంగిక దాడి..!

మద్యం మత్తులో డబ్బులు ఇవ్వకుండా విసిగించిన ప్రయాణికుడిపై లైంగిక దాడి చేశాడు ఓ ఆటో డ్రైవర్. ఈ ఘటన ముంబై, ఘట్ కోపర్ లోని సబర్బన్ ప్రాంతంలో జరిగింది. శనివారం రాత్రి 31ఏళ్ల వ్యక్తి తన గమ్యస్థానికి చేరడానికి ఆటో ఎక్కాడు. మద్యం మత్తులో, ఎటువెళ్లాలో తెలియక ఆటో డ్రైవర్ కు పలు రూట్లలో వెళ్లాలని కోరాడు. ప్రయాణికుడు చెప్పిన ప్రదేశానికి తీసుకువెళ్లిన తర్వాత మరొక ప్రదేశానికి వెళ్లాలని చెప్పాడు. తీరా గమ్యస్థానానికి చేరుకున్న తర్వాత ఆటో చార్జ్ 250 రూపాయలు అయింది.

ఆటో కిరాయి రూ.250 ఇవ్వాలని ప్రయాణికుడిని డ్రైవర్ కోరగా 100 రూపాయలు ఇచ్చాడు. మరో రూ.150 తన వద్దలేవని తెలిపాడు. ఇద్దరిమధ్య వాగ్వాదం జరిగింది. కోపంతో ఊగిపోయిన డ్రైవర్ సదరు ప్రయాణికున్ని పక్కనే ఉన్న పార్క్ లోకి తీసుకెళ్లి లైంగికంగా దాడి చేశాడు. ఆపై ప్రయాణికున్ని ATM సెంటర్ కు వెళ్లి రూ.200 డ్రా చేసి తీసుకురావాలని కోరాడు. ప్రయాణికుడు వినిపించుకోక పోయేసరికి అతని ఫోన్ ను, ATM కార్డును ఆటో డ్రైవర్ లాక్కున్నాడు.

మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేయడానికి పోలీస్టేషన్ కు వెళ్లాడు ప్రయాణికుడు. మతిస్థిమితం లేనట్లు సదరు ప్రయాణికుడు వ్యవహరించాడని పోలీసులు తెలిపారు. అనంతరం ప్రయాణికుడు జరిగిన వ్యవహారం మొత్తాన్ని చెప్పినట్లు చెప్పారు. దీంతో సదరు డ్రైవర్ ను అరెస్ట్ చేసినట్లు పోలీసులు చెప్పారు.

Tags

Read MoreRead Less
Next Story