సహాజీవనం చేస్తున్న మహిళను చంపి కుక్కర్ లో ఉడకబెట్టాడు

సహజీవనం చేస్తున్న మహిళను చంపి కుక్కర్లో ఉడకబెట్టాడు ఓ వ్యక్తి. ఈ ఘటన ముంబైలో జరిగింది. ఫ్లాట్ నుంచి దుర్వాసన రావడటంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితున్ని అరెస్ట్ చేశారు.
ముంబైలోని గీతానగర్ ఫేజ్ 7, మీరా రోడ్డులో... మనోజ్ (56) అనే వ్యక్తి సరస్వతి వైద్య (36) అనే మహిళతో కలిసి మూడేళ్లుగా సహజీవనం చేస్తున్నాడు. ఫ్లాట్ నుంచి దుర్వాసన రావడటంతో బుధవారం సాయంత్రం నయానగర్ పోలీసులకు స్థానికులు ఫిర్యాదు చేశారు. అప్రమత్తమైన పోలీసులు ఫ్లాట్ కు చేరుకుని కుళ్లిపోయి ముక్కలుగా చేయబడిన మృతదేహాన్ని కనుగొన్నారు. కుళ్లిపోయిన మృతదేహాలను బట్టి మూడు, నాలుగురోజుల క్రితమే హత్య జరిగినట్లు పోలీసులు తెలిపారు.
"మనోజ్ సహాని, సరస్వతి వైద్య లివ్-ఇన్ రిలేషన్ షిప్ లో ఉన్నారు. వీరి మధ్య పలు విషయాలపై గొడవ జరిగింది. దీంతో సరస్వతి వైద్యను మనోజ్ హత్య చేశాడు. ఆమె మృతదేహాన్ని ముక్కలుగా నరికాడు. మనోజ్ సాక్షాలను దాచడానికి ప్రయత్నించాడు." అని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (జోన్ 1) జయంత్ బజ్బలే మీడియాకు చెప్పారు. నిందితున్ని అరెస్ట్ చేసి విచారణ జరుపుతున్నట్లు తెలిపారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com