జగన్‌ అన్ని వ్యవస్థల్ని నాశనం చేశారు: లోకేష్‌

జగన్‌ అన్ని వ్యవస్థల్ని నాశనం చేశారు: లోకేష్‌
X

జగన్‌ అన్ని వ్యవస్థల్ని నాశనం చేశారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్‌ నిప్పులు చెరిగారు. కడపలో జిల్లా న్యాయవాదులతో ఆయన సమావేశమయ్యారు. ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ప్రజా వేదిక కూల్చి జగన్‌ పరిపాలన ప్రారంభించారని లోకేష్‌ అన్నారు. జగన్ పాలనలో న్యాయవాదులు కూడా బాధితులేనని.. న్యాయవాదులపై దాడులు చేయించారని ఆరోపించారు. న్యాయవాదులకు అనేక హామీలు ఇచ్చిన జగన్.. ఒక్క హామీ కూడా నిలబెట్టుకోలేదన్నారు.

టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే న్యాయ శాఖకు.. అధిక నిధులు కేటాయించి సమస్యలు పరిష్కరిస్తామని చెప్పారు. చనిపోయిన వారి కుటుంబానికి 10 లక్షలు ఆర్ధిక సాయం అందిస్తామని.. న్యాయవాదులకు హెల్త్ కార్డులు అందిస్తామని హామీ ఇచ్చారు. చట్టాన్ని అతిక్రమించి న్యాయవాదులపై కేసులు పెట్టిన అధికారులపై.. జ్యుడిషియల్ ఎంక్వైరీ వేసి చర్యలు తీసుకుంటామన్నారు.

Tags

Next Story