లోకేష్ వెంట వేలాది యువత

కడప జిల్లా ప్రొద్దుటూరు నియోజకవర్గంలో యువగళం పాదయాత్ర జోరుగా సాగుతుంది. లోకేష్ వెంట వేలాది మంది యువత, మహిళలు, ప్రజలు కలిసి నడుస్తున్నారు. దీంతో రోడ్లన్నీ జనసంద్రమయ్యాయి. ఊరువాడ లోకేష్‌కు ఘన స్వాగతం పలుకుతుంది. మహిళలు హారతులు ఇస్తున్నారు. లోకేష్ తో సెల్ఫీలు దిగేందుకు పోటీ పడుతున్నారు. అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ ఆయన ముందుకు వెళుతున్నారు. తమ గ్రామాల్లోని సమస్యలపై ప్రజలు వినతిపత్రాలు అందజేస్తున్నారు. టీడీపీ ప్రభుత్వం రాగానే అభివృద్ధి పట్టాలెక్కిస్తామని లోకేష్ హామీ ఇస్తూ ముందుకు సాగుతున్నారు.
చౌటుపల్లి క్యాంప్ సైట్ నుంచి లోకేష్ పాదయాత్ర ప్రారంభించారు.. దొరసానిపల్లిలో బుడగజంగాలతో లోకేష్ భేటీ కానున్నారు.. ఆ తర్వాత యువతతో సమావేశమై వారి సమస్యలు అడిగి తెలుసుకుంటారు.. గాడిదకొట్టాల వద్ద స్థానికులతో భేటీ అవుతారు. ఆ తర్వాత జీవనజ్యోతి స్కూలు వద్ద చేనేతలతో లోకేష్ సమావేశం అవుతారు. ఆర్ట్స్ కాలేజ్ జంక్షన్, సాయిబాబా గుడివద్ద స్థానికులతో భేటీ అవుతారు.. వన్ టౌన్ సర్కిల్‌లో పర్లపాడు గ్రామస్తులతో సమావేశం అనంతరం ఎల్ఐసీ కార్యాలయం వద్ద క్రిస్టియన్లతో భేటీ అవుతారు.
ఇక కాసేపట్లో శివాలయం సర్కిల్‌లో ఏర్పాటు చేసిన బహిరంగసభలో ప్రజలనుద్దేశించి లోకేష్ ప్రసంగిస్తారు. సభ అనంతరం రాత్రి 7 గంటలకు ఆర్టీసీ బస్టాండు వద్ద.. 8 గంటల సమయంలో నిమిషాలకు కొత్తపల్లి రిలయన్స్ జంక్షన్‌లో స్థానికులతో సమావేశం కానున్నారు. కొత్తపల్లి ఖాదరబాద్‌లో స్థానికులతో మాటామంతీ అనంతరం.. కొత్తపల్లి శివారు పీఎన్ఆర్ ఎస్టేట్ వద్ద ఏర్పాటు చేసిన విడిది కేంద్రంలో లోకేష్ బస చేస్తారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com