యూపీ పెట్టుబడులకు సురక్షితం : సీఎం యోగీ ఆదిత్య నాథ్

ఉత్తర ప్రదేశ్ లో ఏ క్రిమినల్ కూడా పారిశ్రామిక వేత్తను బెదిరించే పరిస్థితి లేదని అన్నారు యూపీ సీఎం యోగీ ఆదిత్య నాథ్. లక్నోలోని హర్దోయ్ జిల్లాల్లో టెక్స్‌టైల్ పార్కుల ఏర్పాటుకు సంబంధించిన అవగాహన ఒప్పంద కార్యక్రమంలో మాట్లాడిన ముఖ్యమంత్రి... పీఎం మెగా ఇంటిగ్రేటెడ్ టెక్స్‌టైల్స్ అండ్ అపెరల్ (పీఎం మిత్ర) పథకం కింద టెక్స్‌టైల్ పార్కులను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
"ప్రొఫెషనల్ క్రిమినల్స్ గాని, మాఫియాగాని ఏ పారిశ్రామికవేత్తను ఫోన్‌లో బెదిరించలేరు. 2012, 2017 మధ్య ఉత్తర ప్రదేశ్ లో 700 కంటే ఎక్కువ అల్లర్లు జరిగాయి. బీజేపీ అధికారంలోకి వచ్చాక... ( 2017, 2023 మధ్య ) యుపిలో అల్లర్లు చెలరేగలేదు, కర్ఫ్యూ విధించబడలేదు. పెట్టుబడి పెట్టడానికి, పరిశ్రమల స్థాపనకు ఇది అత్యంత అనుకూలమైన అవకాశం" అని యోగీ చెప్పారు.
గ్యాంగ్ స్టర్ అతిక్, అతని సోదరున్ని శనివారం రాత్రి కొందరు దుండగులు కాల్చి చంపారు. ఈ విషయంపై విపక్షాలు యోగీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డాయి. ఇప్పటికే 184 ఎన్ కౌంటర్లు జరిగినట్లు పోలీసులు అధికారికంగా ప్రకటించారు. ఇదిలా ఉండగా... సీఎం యోగీ ఆదిత్యనాథ్ వ్యాఖ్యలు సంచలనమయ్యాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com