పూంచ్ ఉగ్రదాడి జరిగిన ప్రాంతానికి చేరుకున్న ఎన్ఐఏ

పూంచ్ ఉగ్రదాడి జరిగిన ప్రాంతానికి చేరుకున్న ఎన్ఐఏ
ఉగ్రదాడిలో మరణించిన ఐదుగురు జవాన్ల పేర్లు విడుదల చేసిన సైన్యం

జమ్మూకాశ్మీర్ లోని పూంచ్ లో చోటుచేసుకున్న ఉగ్ర దాడి ఘటన ప్రాంతానికి జాతీయ ప్రత్యేక దర్యప్తు బృందం ఎన్ఐఏ చేరుకుంది. శుక్రవారం చోటుచేసుకున్న ఈ ఘటనలో ఐదుగురు జవాన్లు మరణించిన సంగతి తెలిసిందే. ఉగ్రవాదలు సైనిక వాహనంపై కాల్పులు జరపడంతో సదురు వాహనంలో ప్రయాణిస్తోన్న జవాన్లలో ఐదుగులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ రోజు మధ్యాహ్నం 12.30 గంటలకు ఎనిమిది మంది ఫారెన్సిక్ నిపుణులతో కూడిన బృందం ఘటన స్థలానికి చేరుకుని దర్యప్తు ప్రారంభించనుంది. మరోవైపు ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన జవాన్లను సైన్యం గుర్తించింది. హవాల్దార్ మన్దీప్ సింగ్, లాన్స్ నాయక్ దేబాసిష్ బాస్వల్, లాన్స్ నాయక్ కుల్వంత్ సింగ్, సిపాయ్ హరికిషన్ సింగ్, సిపాయ్ సేవక్ సింగ్ ఫొటోలను విడుదల చేసింది. ఆర్మీ స్టాఫ్ జనరల్ అధినాయకుడు మనోజ్ పాండే జవాన్ల వీరమరణానికి సంఘీభావం తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story