ఢిల్లీ కోర్టులో కాల్పుల కలకలం, మహిళకు గాయాలు

ఢిల్లీ కోర్టులో కాల్పుల కలకలం, మహిళకు గాయాలు

ఢిల్లీ సాకేత్ జిల్లా కోర్టులో కాల్పులు జరిగాయి. శుక్రవారం జరిగిన ఈ ఘటనలో ఓ మహిళ గాయపడింది. లాయర్ వేషం వేసుకున్న ఓ వ్యక్తి కాల్పులు జరిపినట్లు పోలీసులు తెలిపారు. నాలుగు రౌండ్ల కాల్పులు జరిగినట్లు చెప్పారు. మహిళ పరిస్థితి విషమంగా ఉండటంతో ఎయిమ్స్ కు తరలించినట్లు తెలిపారు. కాల్పుల సమాచారం అందగానే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితున్ని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Tags

Next Story