Terror Attack : పూంచ్ ఉగ్రదాడిలో.. చైనా బుల్లెట్లు, పాకిస్థాన్ తీవ్రవాదులు

Terror Attack : పూంచ్ ఉగ్రదాడిలో.. చైనా బుల్లెట్లు, పాకిస్థాన్ తీవ్రవాదులు

జమ్మూ కశ్మీర్ లోని పూంచ్ లో జరిగిన ఉగ్రదాడిలో పాకిస్థాన్ కు చెందిన తీవ్రవాదులు పాల్గొన్నారని ఆర్మీ అధికారులు తెలిపారు. వీరు చైనాలో తయారు చేసిన స్టీల్ బుల్లెట్స్ ను ఉపయోగించినట్లు స్పష్టం చేశారు. వాహనాలకు అంటుకునే బాంబులను ఈ దాడిలో వాడినట్లు చెప్పారు. వీటిని రిమోట్ తో పాటు, టైమర్ లతో కూడా ఆపరేట్ చేయవచ్చని అన్నారు. ఫోరెన్సిక్ బృందం ఆర్మీ ట్రక్కుపై పేల్చిన 36 రౌండ్ల బుల్లెట్లతో సహా అన్ని నమూనాలను సేకరించింది. ట్రక్కు నుంచి రెండు గ్రెనేడ్ పిన్నులను కూడా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి.

నివేదికల ప్రకారం, ఇవి ఆర్మర్-పియర్సింగ్ 7.62 MM స్టీల్ కోర్ బుల్లెట్లు అని తెలిపారు, ఇవి చైనాలో తయారు చేయబడ్డాయని చెప్పారు. గత ఏడాది కత్రాలో జరిగిన దాడిని పోలిన విధంగానే ఈ దాడి కార్యచరణ జరిగిందని అన్నారు. ఆర్మీ, రాష్ట్ర పోలీసులు, పారామిలటరీ బలగాలతో కూడిన భారీ సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. ఇందుగుకుగాను దాదాపు 2,000 మంది కమాండోలను మోహరించారు. ఈ దాడికి సంబంధించి ఇంటెలిజెన్స్ బ్యూరో (IB) హోం మంత్రిత్వ శాఖ, జాతీయ దర్యాప్తు సంస్థ (NIA)తో నివేదికను పంచుకుంది.

రెండు గ్రూపులకు చెందిన ఏడుగురు ఉగ్రవాదులు ఈ ఉగ్రదాడిలో పాల్గొన్నారని రక్షణ వర్గాలకు సమాచారం అందింది. ఇందులో పాకిస్థాన్‌ గ్రూపులకు చెందిన ఉగ్రవాదులు పాల్గొన్నారని పేర్కొన్నారు. జైషే మహ్మద్ (జెఇఎం), లష్కరే తోయిబా (ఎల్‌ఇటి) సహాయంతో ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారని, వారు జె & కె రాజౌరిలో చురుకుగా ఉన్నారని నిఘా వర్గాలు తెలిపాయి.

Tags

Read MoreRead Less
Next Story