పూంచ్ ఉగ్రదాడిలో చైనా బుల్లెట్ల వాడటం

పూంచ్ ఉగ్రదాడిలో చైనా బుల్లెట్ల వాడటం
జవాన్లపైకి దూసుకువచ్చిన 36 రౌండ్ల స్టీల్ బుల్లెట్లు

జమ్మూ కశ్మీర్ లోని పూంచ్ లో జరిగిన ఉగ్రదాడిలో పాకిస్థాన్ కు చెందిన తీవ్రవాదులు పాల్గొన్నారని ఆర్మీ అధికారులు తెలిపారు. వీరు చైనాలో తయారు చేసిన స్టీల్ బుల్లెట్స్ ను ఉపయోగించినట్లు స్పష్టం చేశారు. వాహనాలకు అంటుకునే బాంబులను ఈ దాడిలో వాడినట్లు చెప్పారు. వీటిని రిమోట్ తో పాటు, టైమర్ లతో కూడా ఆపరేట్ చేయవచ్చని అన్నారు. ఫోరెన్సిక్ బృందం ఆర్మీ ట్రక్కుపై పేల్చిన 36 రౌండ్ల బుల్లెట్లతో సహా అన్ని నమూనాలను సేకరించింది. ట్రక్కు నుంచి రెండు గ్రెనేడ్ పిన్నులను కూడా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి.


Tags

Next Story