బంగ్లాను ఖాళీ చేసిన రాహుల్‌ గాంధీ

బంగ్లాను ఖాళీ చేసిన రాహుల్‌ గాంధీ
లోక్‌సభ సభ్యత్వాన్ని కోల్పోయిన కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్ గాంధీ తన అధికారిక బంగ్లాను ఖాళీ చేశారు

లోక్‌సభ సభ్యత్వాన్ని కోల్పోయిన కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్ గాంధీ తన అధికారిక బంగ్లాను ఖాళీ చేశారు. రెండు దశాబ్దాలుగా 12- తుగ్లక్‌ లేన్‌ బంగ్లాలో ఉంటున్న రాహుల్‌.. ఆ ఇంటిని ఖాళీ చేశారు. ఇటీవల కొన్ని వస్తువులను తల్లి సోనియా గాంధీ అధికారిక నివాసమైన 10 జన్‌పథ్‌కు తరలించారు. ఇప్పుడు సోదరి ప్రియాంక గాంధీ వాద్రాతో కలిసి తన నివాసానికి వెళ్లిన రాహుల్‌ మిగతా వస్తువులను తీసుకుని బంగ్లా తాళాలను లోక్‌సభ సెక్రటేరియట్‌కు అప్పగించారు. ఇకపై రాహుల్‌ తన తల్లితో కలిసి జన్‌పథ్‌లో ఉండనున్నారు.

రాహుల్‌ అధికారిక బంగ్లాను ఖాళీ చేసిన నేపథ్యంలో కాంగ్రెస్‌ నేతలు ఆయనకు మద్దతుగా నిలుస్తున్నారు. నా నివాసమే మీ నివాసం అనే హ్యష్‌ట్యాగ్‌తో ట్వీట్లు చేస్తున్నారు. పరువు నష్టం కేసులో రెండేళ్ల జైలు శిక్ష పడటంతో రాహుల్‌ లోక్‌సభ సభ్యత్వం రద్దయింది. నిబంధనల ప్రకారం.. అనర్హత వేటు పడిన సభ్యులు అధికారిక నివాసాన్ని నెల రోజుల్లోగా ఖాళీ చేయాల్సి ఉంటుంది. దీంతో ఆయన తన అధికారిక నివాసాన్ని వీడారు.

Tags

Read MoreRead Less
Next Story