ప్రధాని సుడిగాలి పర్యటన

ప్రధాని సుడిగాలి పర్యటన
36 గంటల్లో 5వేల 300 కిలోమీటర్లు ప్రయాణించి 7 నగరాల్లో సుడిగాలి పర్యటన జరపనున్నారు

ప్రధాని మోదీ నేడు పలు నగరాల్లో పర్యటన చేయనున్నారు. 36 గంటల్లో 5వేల 300 కిలోమీటర్లు ప్రయాణించి 7 నగరాల్లో సుడిగాలి పర్యటన జరపనున్నారు. ఉత్తరాది నుంచి దక్షిణాది వరకూ పలు నగరాల్లో అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. ఢిల్లీ నుంచి ఇవాళ మోదీ బయలుదేరతారు. 500 కిలోమీటర్లు ప్రయాణించి మధ్యప్రదేశ్‌ లోని ఖజురహో చేరుకుంటారు. అక్కడి నుంచి రేవా వెళ్లి జాతీయ పంచాయతీరాజ్‌ దినోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. అక్కడి నుంచి ఖజురహో తిరిగివచ్చి 17వందల కిలోమీటర్ల దూరం ప్రయాణించి కొచ్చిలో జరిగే యువమ్‌ సదస్సులో పాల్గొంటారు.

రేపు ఉదయం కొచ్చిన్‌ నుంచి 150కిలోమీటర్ల దూరంలో ఉన్న తిరువనంతపురం చేరుకుని వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభిస్తారు. పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు. అక్కడి నుంచి మళ్లీ 15వందల 70 కిలోమీటర్లు దూరంలో ఉన్న సిల్వాసా చేరుకుంటారు. అక్కడ నమో వైద్య కళాశాల సందర్శనతోపాటు పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం అక్కడి నుంచి దమణ్‌ చేరుకుని డేవ్కా సీఫ్రంట్‌ను ప్రారంభిస్తారు. పర్యటన ముగించుకుని సూరత్‌ మీదుగా తిరిగి ఢిల్లీ చేరుకుంటారు.

Tags

Read MoreRead Less
Next Story