ఢిల్లీ మద్యం కేసులో మరో ఛార్జిషీట్

ఢిల్లీ మద్యం కేసులో మరో ఛార్జిషీట్ దాఖలు అయ్యింది. రౌస్‌అవెన్యూలోని ప్రత్యేక న్యాయస్థానంలో అదనపు ఛార్జిషీట్‌ను దాఖలు చేసింది సీబీఐ. 209 పేజీల ఈ ఛార్జిషీట్ పరిగణనలోకి తీసుకునే విషయంపై మే 12న విచారణ చేపట్టనున్నట్లు ప్రత్యేక న్యాయస్థానం తెలిపింది. తాజా ఛార్జిషీట్‌లో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా, గోరంట్ల బుచ్చిబాబు, హైదరాబాద్‌కు చెందిన వ్యాపారి అరుణ్ రామచంద్రపిళ్లై, అమన్‌దీప్ దల్‌లపై అభియోగాలు నమోదు చేసింది. ఢిల్లీ మద్యం విధానంలో సిసోడియా సహా పలువురిపై అభియోగాలు మోపుతూ గతేడాది ఆగస్టు 22న సీబీఐ కేసు నమోదు చేసింది. 2021-22 సంవత్సరానికి సంబంధించి ఢిల్లీ మద్యం విధానంలో అక్రమాలు, ఇతర ఆరోపణలకు సంబంధించి మొత్తంగా 14 మందిపై అభియోగాలు నమోదు చేసిన సీబీఐ.. ఢిల్లీ, గురుగ్రామ్, చండీగఢ్, ముంబయి, హైదరాబాద్, లఖ్‌నవూ, బెంగళూరు తదితర ప్రాంతాల్లో ఆధారాలు సేకరించింది. సిసోడియాతో పాటు పలువురిని అరెస్టు చేసింది. కేసు దర్యాప్తులో భాగంగా గతేడాది నవంబరు 25న తొలి ఛార్జిషీట్‌ను దాఖలు చేసింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com