రెజ్లర్లకు మద్దతుగా ఒలంపిక్ హీరో

రెజ్లర్లకు మద్దతుగా ఒలంపిక్ హీరో
పారదర్శకమైన విచారణ జరపాలని కోరిన నీరజ్ చోప్రా

ఒలంపిక్ గోల్ మెడలిస్ట్ నీరజ్ చోప్రా భారత రెజ్లింగ్ ఫెడరేషన్ పై రెజ్లర్లు సాగిస్తున్న పోరుపై స్పందించాడు. రెజ్లింగ్ సంఘం అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ పై మహిళా రెజ్లర్లు వినేశ్ ఫోగట్, సాక్షి మాలిక్, భజరంగ్ పునియా తమను లైంగికంగా వేధించాడని ఆరోపిస్తోన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం జంతర్ మంతర్ వద్ద నిరసన చేపట్టిన రెజ్లర్లకు పలువురు క్రీడాకారులు మద్దతుగా నిలిచారు. ఈ క్రమంలో నీరజ్ చోప్రా సైతం రెజ్లర్లకు సంఘీభావం తెలిపాడు. ఇది చాలా సున్నితమైన వ్యవహారమని, పక్షపాతానికి తావు లేకుండా, పారదర్శకంగా విచారణ జరగాలని తన సోషల్ మీడియా పేజ్ పై స్పందించాడు. అధికారులు త్వరిత గతిన చర్యలు తీసుకుని న్యాయం జరిగేలా చూడాలని కోరాడు.


Tags

Read MoreRead Less
Next Story