Elections 2024 : మోదీని ఢీకొట్టేందుకు ఏకమవుతున్న విపక్షాలు

2024 ఎన్నికల్లో మోదీని ఢీకొట్టేందుకు ఏకమవుతున్న విపక్షాలు.. మరో కీలక అడుగు వేసేందుకు సిద్ధమవుతున్నాయి. ప్రస్తుతం కర్నాటక ఎన్నికల హడావుడి కొనసాగుతున్న నేపథ్యంలో.. ఎన్నికల ప్రక్రియ పూర్తైన తర్వాత విపక్ష నేతలు సమావేశం కావాలని నిర్ణయించారు. మే 10తర్వాత పాట్నాలో సమావేశం ఉంటుందని జనతాదళ్ యునైటెడ్ వర్గాలు వెల్లడించాయి. సమావేశానికి కాంగ్రెస్ సహా పలు ప్రాంతీయ పార్టీల నేతలు పాల్గొంటారు. విపక్షాల ఐక్యత కోసం జరిపిన చర్చల్లో కొంత సానుకూల స్పందన వచ్చిందని నితీష్‌కుమార్ సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. కాంగ్రెస్, కమ్యూనిస్ట్‌లు సహా ఇప్పటికే పలు ప్రాంతీయ పార్టీల నేతలతో నితీష్ చర్చలు జరిపారు. త్వరలో బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్, బిజూ జనతాదళ్, ఒరిస్సా సీఎం నవీన్‌పట్నాక్‌తోనూ నితీష్‌కుమార్ భేటీ అవుతారని ఆయన సన్నిహిత నేతలు చెబుతున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com