మహిళ రెజ్లర్ల ఆందోళనకు మంత్రి కేటీఆర్ మద్దతు

లైంగిక వేధింపుల ఆరోపణలపై మహిళ రెజ్లర్లు చేస్తున్న ఆందోళనకు మంత్రి కేటీఆర్ మద్దతు తెలిపారు. ఈ ఒలింపిక్ చాంపియన్లు దేశానికి పతకాలు తెచ్చినప్పుడు మనం సంబరాలు చేసుకుంటామని కేటీఆర్ అన్నారు. ఇప్పుడు వాళ్లు న్యాయం కోసం పోరాడుతున్న తరుణంలో మనందరం వారికి బాసటగా నిలవాలన్నారు. రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడిపై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణల పట్ల నిష్పక్షపాత ధోరణిలో దర్యాప్తు జరపాలన్నారు. న్యాయాన్ని కాపాడాలని... రెజ్లర్ల నిరసనకు తన హృదయపూర్వక మద్దతు తెలుపుతున్నాని కేటీఆర్ అన్నారు
రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడంటూ మహిళా రెజ్లర్లు ఢిల్లీలో గత కొన్నిరోజులుగా ధర్నా చేస్తున్నారు. అయితే ఆయనపై గత కొన్నినెలలుగా ప్రముఖ రెజ్లర్లు సంచలన ఆరోపణలు చేస్తున్నారు. ఆయనను డబ్ల్యూఎఫ్ఐ అధ్యక్ష పదవి నుంచి తప్పించాలని, జైల్లో పెట్టాలని రెజ్లర్లు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రెజ్లర్లు ధర్నాకు మంత్రి కేటీఆర్ మద్దతు తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com