కర్ణాటకలో ప్రచార హోరు.. రంగంలోకి ప్రధాని మోదీ

కర్ణాటకలో ప్రచార హోరు.. రంగంలోకి ప్రధాని మోదీ
ఆరు రోజుల పాటు కర్ణాటకలోని పలు నగరాల్లో మోదీ సుడిగాలి పర్యటనలు

కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల ప్రచార హోరు నెలకొంది. ముఖ్యంగా కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ప్రచారంలో మునిగిపోయాయి. ఇవాళ్టి నుంచి ప్రధాని మోదీ రంగంలోకి దిగనున్నారు. ఆరు రోజుల పాటు కర్ణాటకలోని పలు నగరాల్లో సుడిగాలి పర్యటనలు చేయనున్నారు. రాష్ట్రంలో పోలింగ్‌కు ఇంకా పన్నెండు రోజులు మాత్రమే మిగిలి ఉంది. అన్ని పార్టీలు రాష్ట్ర ఓటర్ల హృదయాలను గెలుచుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. అధికార బిజెపి ప్రచారంలో కొంచెం ముందుంది. ఆ పార్టీ సీనియర్ నేతలు కర్ణాటక ఎన్నికల ప్రచార రంగంలోకి దిగి ఓట్ల కోసం ప్రచారం ప్రారంభించారు.

ఇవాళ కర్ణాటకలో ప్రధాని మోదీ ల్యాండ్‌ అవుతారు. ఉదయం 8:20 గంటలకు ఢిల్లీ విమానాశ్రయం నుంచి బయలుదేరి 10:20 గంటలకు బీదర్ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా హెలికాప్టర్‌లో 10:50కి హుమ్నాబాద్ చేరుకుంటారు. హుమ్నాబాద్ హెలిప్యాడ్ నుంచి రోడ్డు మార్గంలో బహిరంగ సభ జరిగే ప్రదేశాన్ని మోదీ సందర్శించనున్నారు. ఉదయం 11:00 నుంచి 11:40 గంటల వరకు హుమ్నాబాద్‌లో బహిరంగ సభలో పాల్గొని అభ్యర్థులకు ఓట్లు అభ్యర్థించనున్నారు. అనంతరం భారీ రోడ్ షో ద్వారా ప్రధాని మోదీ విజయపూర్ కుడుచిని ప్రసంగించనున్నారు.

మరో రెండు వారాల్లో మొత్తం ఆరు రోజుల పాటు ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ఇప్పటికే బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేతలు సుడిగాలి ప్రచారంలో మునిగిపోగా.. ఇప్పుడు ప్రధాని మోదీ కూడా ఎంట్రీ ఇస్తున్నారు. వరుసగా ఆరు రోజులపాటు కర్నాటకలోనే పర్యటించబోతున్నారు ప్రధాని. ఇవాళ సుమారు 10 కిలోమీటర్ల రోడ్‌ షో ఉండనుంది. గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల సమయంలో నిర్వహించిన భారీ రోడ్‌ షో తరహాలో బెంగళూరులోనూ ప్లాన్‌ చేశారు. రెండోరోజు కోలార్‌, చెన్నపట్న, మైసూరు బహిరంగ సభల్లో పాల్గొంటారు మోదీ.

Tags

Read MoreRead Less
Next Story