డిప్యూటీ సీఎం సిసోడియాకు చుక్కెదురు.. బెయిల్‌ నిరాకరణ

డిప్యూటీ సీఎం సిసోడియాకు చుక్కెదురు.. బెయిల్‌ నిరాకరణ
ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్‌ సిసోడియాకు బెయిల్‌ ఇచ్చేందుకు రౌస్‌ అవెన్యూ సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం నిరాకరించింది

ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్‌ సిసోడియాకు బెయిల్‌ ఇచ్చేందుకు రౌస్‌ అవెన్యూ సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం నిరాకరించింది. ప్రస్తుతం తిహార్ జైలులో ఉన్న ఆయన.. అనారోగ్యానికి గురైన తన భార్యకు చికిత్స చేయించేందుకుగాను బెయిల్‌ ఇవ్వాలని పిటిషన్‌ దాఖలు చేశారు. సీబీఐ ప్రత్యేక జడ్జి ఎంకే నాగ్‌పాల్‌ బెయిల్‌ పిటిషన్‌పై విచారణ చేపట్టారు. అక్రమ నగదు చలామణి వ్యవహారంలో సిసోడియా పాత్రను నిరూపించే ప్రాథమిక సాక్ష్యాధారాలను ఈడీ చూపించిందని ప్రత్యేక జడ్జి తెలిపారు. సిసోడియా సతీమణి అనారోగ్యం బెయిల్‌ ఇచ్చేందుకు అవకాశం ఉన్న అంశం కాదని ప్రత్యేక జడ్జి తెలిపారు.

Tags

Next Story