మహిళా రెజ్లర్ల నిరసనకు ప్రియాంకా వాద్ర సంఘీభావం

భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు.. బ్రిజ్‌భూషణ్ శరణ్‌సింగ్‌పై చర్యలు తీసుకోవాలంటూ ఢిల్లీలో రెజ్లర్లు చేపట్టిన ఆందోళన కొనసాగుతోంది. వీరి నిరసనకు భారత క్రీడాలోకంతో పాటు పలు రాజకీయ పార్టీలు కూడా మద్దతుగా నిలుస్తున్నాయి. తాజాగా రెజ్లర్లకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా సంఘీభావం పలుకుతూ దీక్షలో పాల్గొన్నారు. ఉదయం జంతర్ మంతర్ వద్ద దీక్షా శిబిరానికి వచ్చిన ప్రియాంక.. రెజ్లర్లతో మాట్లాడి వారిని ఓదార్చారు. ఈ సందర్భంగా మహిళా రెజ్లర్లు సాక్షి మాలిక్, వినేశ్ ఫొగాట్, ప్రియాంకలు తమ సమస్యలను వివరించారు.
బ్రిజేష్‌భూషణ్ పై FIR నమోదు చేశామని చెపుతున్న పోలీసులు.. ఎందుకు ఇంత వరకూ ఆ కాపీని బయటకు చూపించట్లేదని ప్రియాంక గాంధీ ప్రశ్నించారు. రెజ్లర్లు పథకాలు గెలిచినప్పుడు ట్విట్టర్‌లో పోస్ట్ చేసి గర్వపడ్డాంమని.. ఇప్పుడు అదే క్రీడాకారులు న్యాయం కోసం రోడ్డెక్కితే ఎవరూ పట్టించుకోరా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళా రెజ్లర్లంతా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని.. మరో గత్యంతరం లేక ఇలా గొంతెత్తాని ప్రియాంకా గాంధీ అన్నారు. బ్రిజ్‌భూషన్‌ను కాపాడాలని కేంద్రం చూస్తోందని విమర్శించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com