లోయలో పడ్డ ఆర్మీ అంబులెన్స్.. ఇద్దరు జవాన్లు మృతి

లోయలో పడ్డ ఆర్మీ అంబులెన్స్.. ఇద్దరు జవాన్లు మృతి

జవాన్లతో వెళ్తున్న ఆర్మీ మెహికిల్ లోయలోపడి ఇద్దరు సైనికులు మరణించారు. ఈ ఘటన జమ్మూ కశ్మీర్ లోని రాజౌరిలో శనివారం జరిగింది. లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ ( LoC ) సమీపంలోని కేరి సెక్టార్ వద్ద ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. ఆర్మీకి చెందిన అంబులెన్స్ ప్రమాదానికి గురైందని చెప్పారు.

నియంత్రణ రేఖకు సమీపంలో ఉన్న దుంగి గాలా గ్రామ సమీపంలో ఉన్న ఓ వంకర తిరిగే రోడ్డుపై వ్యాను వెళ్తున్న సమయంలో డ్రైవర్ నియంత్రణ కోల్పోయాడని.. దీంతో ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో అంబులెన్స్ డ్రైవర్, ఓ జవాను మృతి చెందినట్లు చెప్పారు. వారి మృతదేహాలను వెలికితీసినట్లు తెలిపారు.

Tags

Next Story