సాహసోపేతంగా ఆపరేషన్ ‘కావేరి’

సూడాన్‌లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చేందుకు భారత వైమానిక దళం తీవ్రంగా శ్రమిస్తోంది. క్లిష్ట పరిస్థితులు ఎదురైనప్పటికీ ఎంతో సాహసోపేతంగా ఆపరేషన్ ‘కావేరి’పేరిట ముమ్మరంగా కొనసాగిస్తోంది. ఈ క్రమంలో గత రెండ్రోజులుగా 121 మందిని తరలించేందుకు ఎయిర్‌ఫోర్స్ డేరింగ్ ఆపరేషన్‌ను నిర్వహించింది. సుడాన్ రాజధాని ఖార్తూమ్‌కు దగ్గర్లో ఉన్న వాది సయ్యిద్నాలో ఉన్న ఒక చిన్నపాటి రన్‌వే పై దిగిన C-130J విమానం ఈ ఆపరేషన్‌లో భాగమైంది. ఇందుకోసం రిస్క్ తీసుకున్నారు వైమానిక దళ అధికారులు. రాత్రి పూట ఈ ఆపరేషన్ చేపట్టారు. రన్‌వే మీద ఎలాంటి అడ్డంకులు, సాయుధులు లేరని నిర్ధారించుకునేందుకు ఇన్ఫ్రారెడ్ సెన్సార్లను ఉపయోగించారు. చిమ్మచీకట్లో నైట్ విజన్ గాగుల్స్‌ను ధరించారు. ల్యాండింగ్ తర్వాత అంతా విమానం ఎక్కేవరకు ఇంజిన్లు ఆన్‌లోనే ఉంచారు. టేక్‌ఆఫ్‌లోనూ ఆ నైట్ విజన్ గాగుల్స్ వాడారు. వాది సయ్యిద్నా నుంచి జెడ్డా వరకు ఈ ఆపరేషన్ రెండున్నర గంటల పాటు జరిగింది. ఈ డేరింగ్ ఆపరేషన్‌లో C-130J విమానానికి గ్రూప్ కెప్టెన్ రవి నందా నాయకత్వం వహించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com