ప్రధాని మన్‌కీ బాత్‌కు వేళాయే..

ప్రధాని మన్‌కీ బాత్‌కు వేళాయే..
ఉదయం 11 గంటలకు ఆల్‌ ఇండియా రేడియోలో మన్‌కీ బాత్‌ ఎపిసోడ్ వందో ఎపిసోడ్ ప్రసారం కానుంది

ప్రధాని మోదీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మన్‌కీ బాత్‌ ఎపిసోడ్‌కు వేళయింది. ఉదయం 11 గంటలకు ఆల్‌ ఇండియా రేడియోలో మన్‌కీ బాత్‌ ఎపిసోడ్ వందో ఎపిసోడ్ ప్రసారం కానుంది. 2014లో ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన మోదీ తన మనసులోని భావాలను వ్యక్తీకరించడానికి.. ప్రతినెలా చివరి ఆదివారం ఆల్‌ ఇండియా రేడియోలో ఏర్పాటు చేసుకున్న ఈ వినూత్న కార్యక్రమం సెంచరీ పూర్తి చేసుకుంటోంది.

ప్రధాని మోదీ మన్‌కీ బాత్‌ వందో ఎపిసోడ్‌కు బీజేపీ భారీ ఏర్పాట్లు చేసింది. దేశవ్యాప్తంగా 4 లక్షల ప్రాంతాల్లో టీవీ స్క్రీన్‌లు ఏర్పాటు చేసింది. అన్ని రాజ్‌భవన్‌లలో, బీజేపీ పాలిత సీఎంల కార్యాలయాలతో పాటు ఐక్య రాజ్య సమితి, విదేశాల్లోనూ ప్రసారమయ్యేలా ఏర్పాట్లు చేసింది. అటు వందో ఎపిసోడ్‌ ప్రసంగాన్ని హోమంత్రి అమిత్‌షా ముంబైలోని విలేపార్లెలో వినబోతున్నారు. అలాగే పద్మ అవార్డు గ్రహీతలకు ప్రత్యేకంగా ఆహ్వానించింది కేంద్రం. ఇక మన్‌ కీ బాత్‌కు రేడియోలో కంటే ఇంటర్నెట్‌లోనే అధిక ఆదరణ లభించింది. రేడియోలో 12 శాతం, టీవీలో 15 శాతం ఉంటే.. ఇంటర్నెట్‌లో అత్యధికంగా 37 శాతం మంది జనం.. ప్రధాని మోదీ మన్‌కీ బాత్‌ను వింటున్నారు.

Tags

Next Story