ప్రధాని మోదీ ఒక గొప్ప కమ్యూనికేటర్: గవర్నర్‌ తమిళి సై

ప్రధాని మోదీ ఒక గొప్ప కమ్యూనికేటర్: గవర్నర్‌  తమిళి సై
ప్రధాని మోడీ మన్‌ కీ బాత్‌ 100వ ఎపిసోడ్‌ సందర్భంగా రాజ్‌భవన్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఆమె మాట్లాడారు

ప్రధాని మోదీ ఒక గొప్ప కమ్యూనికేటర్ అని తెలంగాణ గవర్నర్‌ తమిళి సై అన్నారు. ప్రధాని మోడీ మన్‌ కీ బాత్‌ 100వ ఎపిసోడ్‌ సందర్భంగా రాజ్‌భవన్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. వ్యాక్సిన్ తీసుకునేందుకు జనం భయపడుతున్న సమయంలో మన్ కీ బాత్‌ ద్వారా ప్రజలకు ప్రధాని ధైర్యం చెప్పారని ఆమె అన్నారు. ప్రజలకోసం పనిచేసే వారిని వెతికి తన కార్యక్రమంలో ప్రధాని ప్రస్తావిస్తారని తమిళిసై అన్నారు. స్వచ్చభారత్ ఎంతో మందిలో ఎంతో మార్పు తెచ్చిందని అన్నారు. రెండు కోట్ల మంది చిన్నారులు స్వచ్చ భారత్ డ్రాయింగ్ కాంపిటీషన్ లో పాల్గొన్నారని వెల్లడించారు. ప్రతి వ్యక్తి కష్టాలు తెలుసుకునే వ్యక్తి మోదీ అని గవర్నర్‌ అన్నారు.


Tags

Next Story