బీజేపీ కార్యకర్తల ముష్టిఘాతాలు.. పంచలూడినా కొట్టుకున్నారు

బీజేపీ కార్యకర్తల ముష్టిఘాతాలు.. పంచలూడినా కొట్టుకున్నారు

తమిళనాడు బీజేపీ కార్యకర్తలు కొట్టుకున్నారు. ఒకరిపై ఒకరు కట్టెలతో దాడిచేసుకున్నారు. ఈ ఘటన ఆదివారం రాత్రి జరిగింది. గొడవలో బీజేపీ కార్యకర్తలతో పాటు హిందు మక్కల్ కచ్చి ( HMK) పార్టీ నాయకులు కూడాా పాల్గొన్నారు. ఆదివారం రాత్రి జరిగిన ప్రధాని మోదీ మన్ కీ బాత్ కార్యక్రమం ఈ గొడవకు కారణమైంది. బీజేపీ తిరుప్పూర్ సౌత్ జిల్లా అధ్యక్షుడు మంగళం రవికి ఆ పార్టీ రాష్ట్ర కార్యకర్త కొంగు రమేష్ తో వాగ్వాదం జరగడంతో గొడవ మొదలైంది.

కొంగు రమేష్ షాప్‌లో ప్రధాని నరేంద్ర మోదీ మన్ కీ బాత్ 100వ ఎపిసోడ్ ప్రదర్శించబడుతోంది. రాత్రి 8 గంటల సమయంలో, మంగళం రవి, అతని సహచరులు కొంగు రమేష్ దుకాణానికి వెళ్లారు. ఎపిసోడ్ స్క్రీనింగ్ గురించి వాగ్వాదం చెలరేగింది. ఇరువర్గాలు ముష్టిఘాతాలకు దిగడంతో పాటు ఒకరినొకరు చెక్క దిమ్మెలతో కొట్టుకోవడంతో వాదన హింసాత్మకంగా మారింది. అప్పటికే ఘటనా స్థలంలో ఉన్న హిందూ మక్కల్ కట్చి సభ్యులు కూడా పోరాటానికి దిగారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు ఈశ్వరన్‌, సంస్థాగత కార్యదర్శి శంకర్‌ గాయపడి ఆస్పత్రి పాలయ్యారు. ఎదుటి పక్షం దాడికి పాల్పడ్డారని ఆరోపిస్తూ ఇరువర్గాలు ఇప్పుడు పోలీసులకు ఫిర్యాదు చేశాయి. మరోవైపు ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ, ఫోన్ కెమెరాల్లో రికార్డైన వీడియోలు వైరల్‌గా మారాయి.

Tags

Next Story