పాక్ తీవ్రవాదుల యాప్ లను నిషేధించిన కేంద్ర ప్రభుత్వం

జమ్మూ కశ్మీర్ లో ఘర్షనలు సృష్టించడానికి పాకిస్థాన్ తీవ్రవాదులు తీవ్ర కృషి చేస్తున్నారు. కశ్మీర్ నుంచి కమ్మునికేషన్ కోసం తీవ్రవాదులు ఏర్పాటు చేసుకున్న 14మొబైల్ యాప్ లను భారత ప్రభుత్వం బ్లాక్ చేసింది. కోడ్‌తో కూడిన సందేశాలను పంపేందుకు పాకిస్థాన్‌లోని ఉగ్రవాదులు 14 మొబైల్ అప్లికేషన్‌లను వాడుతున్నట్లు అధికారులు తెలిపారు. జమ్మూ కశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతంలోని ఓవర్‌గ్రౌండ్ కార్మికులు, ఇతర కార్యకర్తలకు, స్లీపర్ సెల్స్ కు కోడ్ సందేశాలను పంపడానికి ఉగ్రవాదులు ఈ అప్లికేషన్‌లను ఉపయోగించినట్లు చెప్పారు. నిషేధించబడిన మెసెంజర్ అప్లికేషన్‌లలో క్రిప్‌వైజర్, ఎనిగ్మా, సేఫ్‌స్విస్, విక్రమ్, మీడియాఫైర్, బ్రియార్, BChat, Nandbox, Conion, IMO, Element, Second line, Zangi మరియు Threema ఉన్నాయి.
దేశ భద్రతకు ముప్పు తెచ్చే మొబైల్ అప్లికేషన్లపై అణిచివేతను భారత్ చాలాకాలంగా అవలంబిస్తోంది. గతంలో పలు చైనీస్ యాప్‌లను నిషేధించిన విషయం తెలిసిందే. గత కొన్ని సంవత్సరాలుగా, భారత ప్రభుత్వం దాదాపు 250 చైనీస్ యాప్‌లపై నిషేధం విధించింది, అవి "భారతదేశ సార్వభౌమాధికారం, సమగ్రతకు, భారతదేశ రక్షణకు, రాష్ట్ర భద్రత మరియు ప్రజా శాంతికి విఘాతం కలిగించాయి. జూన్ 2020 నుంచి, TikTok, Shareit, WeChat, Helo, Likee, UC News, Bigo Live, UC Browser, Xender, Camscanner, PUBG Mobile, Garena Free Fire వంటి ప్రముఖ మొబైల్ గేమ్‌లతో సహా 200కి పైగా చైనీస్ యాప్‌లను ప్రభుత్వం నిషేధించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com