బీఎస్పీ ఎంపీ పై అనర్హత వేటు

మరో ఎంపీపైనా అనర్హత వేటు వేసింది లోక్‌సభ సెక్రటేరియేట్. కిడ్నాప్, హత్య కేసుల్లో 4ఏళ్లు శిక్షపడిన బీఎస్పీ ఎంపీ అఫ్జల్ అన్సారీపై అనర్హత వేటు వేస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. న్యాయస్థానం దోషిగా తేల్చిన నేపథ్యంలో ఘజియాపూర్ లోక్‌సభ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్న అఫ్జల్ అన్సారీ ఎంపీ పదవికి అనర్హుడయ్యారని తెలిపింది. ఏప్రిల్ 29 నుంచి ఇది వర్తిస్తుందని లోక్‌సభ సెక్రెటేరియేట్ జారీ చేసిన నోటిఫికేషన్‌లో పేర్కొంది. ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.
యూపీ ఘజియాబాద్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న అన్సారీకి ఎంపీ, ఎమ్మెల్యే న్యాయస్థానం 4ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చింది. అతడి సోదరుడు ముక్తార్ అన్సారీకి 10 ఏళ్ల జైలు శిక్ష విధించింది. కిడ్నాప్, హత్య ఘటనల్లో గ్యాంగ్‌స్టర్ నిరోధక చట్టం కింద అన్సారీ సోదరులపై 2007లో కేసు నమోదైంది. ఈ కేసులో వీరిద్దర్నీ దోషులుగా తేలుస్తూ యూపీ కోర్టు తాజాగా తీర్పునిచ్చింది. ముక్తార్ అన్సారీకి 10 ఏళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.5లక్షల జరిమానా, అఫ్జల్‌కు నాలుగేళ్ల జైలు శిక్షతో పాటు రూ.లక్ష జరిమానా విధించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com