Delhi High Court : తండ్రిపేరును తొలగించాలన్న ఢిల్లీ హైకోర్టు

బాధ్యత లేని తండ్రి పేరు కుమారుడి పాస్ పోర్టులో ఉండనవసరం లేదని హైకోర్టు తీర్పునిచ్చింది. బిడ్డ తల్లి కడుపులోనే ఉండగా విడాకులు ఇచ్చి తనదారి తాను చూసుకున్న తండ్రి పేరు కుమారుని పాస్ పోర్టునుంచి తొలగించాలని అధికారులను ఆదేశించింది గౌరవ కోర్టు. కొన్ని ప్రత్యేక పరిస్థితులలో తండ్రి పేరును మార్చుకునే అవకాశం ఉందని, ఇంటిపేరును కూడా మార్చుకోవచ్చని పేర్కొంది.
సింగిల్ మదర్ కు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటు తీర్పును వెలువరించింది ఢిల్లీ హైకోర్టు. బిడ్డ పుట్టకముందే తండ్రి విడిచిపెట్టాడని, బిడ్డను ఒంటరిగా పెంచానని తల్లి పిటిషన్ లో పేర్కొన్నారు. తండ్రిచే బిడ్డ పూర్తిగా విడిచిపెట్టబడ్డాడన్న సంగతిని తెలుసుకున్న జస్టిస్ ప్రతిభా సింగ్ ఈ కేసును ప్రత్యేకంగా పరిగనించారు. ఇలాంటి పరిస్థితుల్లో చాప్టర్ 8లోని క్లాజ్ 4.5.1, చాప్టర్ 9లోని క్లాజ్ 4.1 స్పష్టంగా వర్తిస్తాయని ఈ కోర్టు అభిప్రాయపడింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com