కేరళలో 'వందే భారత్' పై రాళ్లు విసిరిన దుండగులు

కేరళలో వందే భారత్ రైలుపై దుండగులు రాళ్లు విసిరారు. ఏప్రిల్ 25న ప్రధాని నరేంద్ర మోదీ తిరువనంతపురం సెంట్రల్ స్టేషన్ లో కేరళ తొలి వందే భారత్ రైలును ప్రారంభించారు. రాళ్లు విసిరిన ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని అధికారులు తెలిపారు. భద్రతను మరితపటిష్టం చేయనున్నట్లు చెప్పారు. రైలు తిరునవయ - తిరూర్ మధ్య ప్రయాణిస్తుండగా ఈ ఘటన జరిగినట్లు చెప్పారు. అగంతకులు రాళ్లు రువ్వడంతో కోచ్ కిటికీ అద్దాలు పగిలిపోయాయి.
గత మూడు నెలల్లో రాళ్లు రువ్వడం ఇది మూడోసారి.
ఏప్రిల్ 6 న, విశాఖపట్నం నుంచి వచ్చిన వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌పై తాజాగా రాళ్లు రువ్విన సంఘటన నమోదైందని అధికారులు తెలిపారు.
సికింద్రాబాద్ నుంచి వస్తుండగా ఖమ్మం-విజయవాడ రైల్వేస్టేషన్ల మధ్య రాళ్లదాడి జరిగిందని, దక్షిణ మధ్య రైల్వే జోన్ ఆవరణలో బుధవారం సాయంత్రం ఈ ఘటన జరిగిందని వాల్‌టెయిర్ డివిజన్ రైల్వే ప్రెస్ నోట్ పేర్కొంది.
జనవరిలో, ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం నగరంలో వందేభారత్ రైలు నిర్వహణ సమయంలో రాళ్లు విసిరారు. విశాఖపట్నంలోని కంచరపాలెం సమీపంలో వందేభారత్ ఎక్స్‌ప్రెస్ కోచ్ అద్దాలు దెబ్బతిన్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com