రాహుల్ గాంధీపై కన్నడ సూపర్‌స్టార్ శివరాజ్ ప్రశంసలు

రాహుల్ గాంధీపై కన్నడ సూపర్‌స్టార్ శివరాజ్ ప్రశంసలు
శివమొగ్గలో కాంగ్రెస్ నిర్వహించిన భారీ ర్యాలీలోసందడి చేశారు శివరాజ్ కుమార్. రాహుల్ గాంధీ అభిమానిగా వచ్చానన్నారు

రాహుల్ గాంధీపై కన్నడ సూపర్‌స్టార్ శివరాజ్ కుమార్ ప్రశంసలు కురిపించారు. శివమొగ్గలో కాంగ్రెస్ నిర్వహించిన భారీ ర్యాలీలోసందడి చేశారు శివరాజ్ కుమార్. రాహుల్ గాంధీ అభిమానిగా వచ్చానన్నారు శివరాజ్.ఆయనతో పాటు ర్యాలీకి వచ్చినందుకు ఆనందంగా ఉందన్నారు.కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా 8 రోజులే ఉండటంతో ప్రచారం ఊపందుకుంది. ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్ శివమొగ్గలో భారీ ర్యాలీ నిర్వహించింది. అగ్రనేత రాహుల్ గాంధీ ముఖ్య అతిథిగా హాజరైయ్యారు. ఇటీవలే భారత్ జోడో యాత్రలో దేశమంతా పాదయాత్ర చేశారని. ఆ యాత్ర నుంచి చాలా స్ఫూర్తి పొందా.' అని శివరాజ్ కుమార్ తెలిపారు.

ఈసమయంలో కాంగ్రెస్ శ్రేణులు కేరింతలు, చప్పట్లతో సభను మారుమోగించాయి. కాగా.. శివరాజ్ కుమార్ సతీమణి గీత శివ ఇటీవలే కాంగ్రెస్‌లో చేరిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆయన కూడా ఆ పార్టీ ప్రచారంలో పాల్గొనడం కాంగ్రెస్‌కు కచ్చితంగా ప్రయోజనం చేకూర్చే విషయమే అని కాంగ్రెస్ శ్రేణులు చెబుతున్నాయి.

Tags

Next Story