కేరళలో నీట మునిగిన హౌస్ బోట్

కేరళలో నీట మునిగిన హౌస్ బోట్
చిన్నారులు, మహిళలు సహా 20 మంది మృతి

కేరళలోని చోటుచేసుకున్న బోట్ హౌస్ ప్రమాదంలో సుమారు 20 మంది మరణించారు. మాలాప్పురం జిల్లాలోని తూవల్తీర్ధం బీచ్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. హౌస్ బోట్ లో 30 మందితో ప్రయాణిస్తున్నట్లు కేరళ క్రీడాశాఖ మంత్రి అద్బురహిమాన్ వెల్లడించారు. క్షతగాత్రులను వివిధ ఆసుపత్రుల్లో అడ్మిట్ చేయగా అక్కడి నుంచి అందిన సమాచారం మేరకు ఇప్పటివరకూ 20 మరణాలు నమోదైనట్లు ధృవీకరించారు. ఇందులో 15మందిని గుర్తించినట్లు వెల్లడించారు. వేసవి సెలవుల్లో చిన్నారులతో పాటూ వచ్చేసిన పర్యటకులు ఈ విధంగా మృత్యువాత పడటంపై మంత్రి విచారం వ్యక్తం చేశారు. గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని, మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని వెల్లడించారు. ఘటనపై స్పందించిన ప్రధాని నరేంద్రమోదీ మృతుల కుటుంబ సభ్యులకు రూ. రెండు లక్షల నష్టపరిహారం ప్రకటించారు.

Tags

Next Story