బస్సెక్కిన రాహుల్‌

బస్సెక్కిన రాహుల్‌
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బెంగళూరులో BMTC బస్సులో ప్రయాణించారు. ఓ సామాన్యుడిలా ప్రజలతో కలసి పోయారు

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బెంగళూరులో BMTC బస్సులో ప్రయాణించారు. ఓ సామాన్యుడిలా ప్రజలతో కలసి పోయారు. తాము అధికారంలోకి వస్తే మహిళలకు ఉచితంగా బస్సులో ప్రయాణించే సౌకర్యం, గృహలక్ష్మి కింద 2వేలు ఇస్తామని హామీ ఇచ్చింది కాంగ్రెస్‌. ఈ హామీలపై బస్సులోని ప్రయాణీకులతో మాట్లాడారు రాహుల్‌. మహిళల రవాణా సమస్యలు, వారి బడ్జెట్‌లను ప్రభావితం చేసే ధరలపైనా మాట్లాడారు. అనంతరం లింగరాజపురంలో బస్సు దిగిన రాహుల్..... అక్కడ బస్టాప్ వద్ద మహిళలతో మరోసారి మాట్లాడారు. అంతకుముందు కన్నింగ్‌హామ్ రోడ్‌లోని కేఫ్ కాఫీ డే అవుట్‌లెట్‌ను సందర్శించారు.

Tags

Read MoreRead Less
Next Story