నేటితో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ఖతం

నేటితో  కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ఖతం
ఇవాల్టీతో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి తెరపడుతోంది

ఇవాల్టీతో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి తెరపడుతోంది. సాయంత్రం 5 గంటలకు పార్టీల మైకులన్నీ బంద్ కానున్నాయి. ఈనెల 10న కర్ణాటక ఎన్నికల పోలింగ్ జరగనుంది. 13న ఫలితాలు వెల్లడికానున్నాయి. ఇక పోలింగ్ సమయం సమీపిస్తుండటంతో ప్రధాన పార్టీలన్నీ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. గెలుపే లక్ష్యంగా బీజేపీ, కాంగ్రెస్‌, జేడీఎస్‌ నాయకులు హోరాహోరీగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ర్యాలీలు, సభలు, రోడ్‌షోలు, మేనిఫెస్టోలు, హామీలతో ఓటర్లను ఆకట్టుకునేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నారు.

మరోవైపు స్థానికులు నియోజకవర్గం విడిచిపెట్టి వెళ్లాలని ఎన్నికల కమిషన్‌ ఆదేశించింది. ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకొంటామని హెచ్చరించింది. బహిరంగ ప్రచారం ముగిసిన తరువాత స్టార్‌ క్యాంపైనర్లు, నేతలు నియోజకవర్గం విడిచిపెట్టాలని. గుంపులుగా, మైక్‌లను పెట్టి ప్రచారం చేయరాదని ఆదేశాలు జారీ చేసింది ఈసీ.అలాగే మద్యం అమ్మకాలపై ఆంక్షలు విధించింది.

కర్ణాటకలో ఎన్నడూ లేని విధంగా ప్రతిష్టాత్మకంగా అసెంబ్లీ ఎన్నికలు మారాయి. దేశ ప్రధాని, ఎందరో అగ్రనేతలు కన్నడనాట కాలికి బలపం కట్టుకుని ప్రచారంలో చెమటోడుస్తున్నారు. ఈ నెల 10వ తేదీన పోలింగ్‌ కావడంతో ఇవాల్టీ సాయంత్రం నుంచి బహిరంగ ప్రచారం ముగుస్తుంది. గత 10 రోజులుగా సాగుతున్న ప్రచార హోరు సైలెంట్‌ కానుంది.

ఇక ప్రధాని మోదీ వరుసగా రెండో రోజు బెంగళూరులో ప్రచారాన్ని హోరెత్తించారు.నార్త్, సౌత్, సెంట్రల్ లోక్‌సభ నియోజకవర్గాలను కవర్ చేస్తూ మోదీ దాదాపు 41 కిలోమీటర్ల రోడ్‌షోను పూర్తి చేశారు. శివమొగ్గ బహిరంగ సభలో ప్రధాని మోదీ కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. అటు కాంగ్రెస్‌ ఆగ్రనేతలు సోనియా,ప్రియాంక గాంధీ కూడా కర్ణాటకలో భారీగా ప్రచారం నిర్వహించారు..రోడ్ షోలతో ప్రజలతో మమేకం అయ్యారు. ఇక జేడీఎస్‌ అధినేత కుమారస్వామి అన్నీ తానే అయి ప్రచారం సాగించారు.

Tags

Next Story