ఇకపై కేంద్రం చేతుల్లోనే మెడికల్ అడ్మిషన్లు

మెడికల్ అడ్మిషన్లను ఇకపై కేంద్రం తన చేతుల్లోకి తీసుకోబోతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతోపాటు ప్రైవేటు మెడికల్ కాలేజీలు, డీమ్డ్ యూనివర్సిటీల్లోని అన్నిరకాల సీట్లకు తామే కౌన్సెలింగ్ నిర్వహిస్తామని తెలిపింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాల వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శులతో లేఖలు రాసింది. మెడికల్ అడ్మిషన్లకు సెంట్రలైజ్డ్ కౌన్సెలింగ్ ప్రక్రియ చేపట్టనున్నట్లు లేఖలో పేర్కొంది. ఈ విధానంతో దేశవ్యాప్తంగా అన్ని మెడికల్ కాలేజీల్లో ఒకేసారి వైద్య విద్య కౌన్సెలింగ్ ప్రక్రియ పూర్తవుతుందని, వైద్య విద్య సీట్ల బ్లాకింగ్‌ను నిరోధించడం కోసమే ఈ ప్రక్రియ చేపట్టనున్నట్లు వెల్లడించింది. యూజీతోపాటు పోస్టు గ్రాడ్యుయేట్ సీట్ల కౌన్సెలింగ్ ప్రక్రియను కూడా చేపట్టనున్నట్లు వెల్లడించింది. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన మాదిరిగానే లోకల్ రిజర్వేషన్లు, స్థానికత ఆధారంగానే కౌన్సెలింగ్ చేపడతామని పేర్కొంది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వాలు తమ అభిప్రాయం తెలపాలని కోరింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com