మధ్యప్రదేశ్‌లో బస్సు ప్రమాదం.. 15 మంది మృతి

మధ్యప్రదేశ్‌లో బస్సు ప్రమాదం.. 15 మంది మృతి

మధ్యప్రదేశ్‌లోని ఖర్గోన్‌లో బస్సు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటన మంగళవారం జరిగింది. బస్సు వంతెనపై నుంచి పడిపోవడంతో 15 మంది మృతి చెందగా, దాదాపు 25 మంది గాయపడ్డారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 50 మందికి పైగా ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు. ఇండోర్‌కు వెళ్తున్న బస్సు అదుపుతప్పి వంతెనపై నుంచి పడిపోయింది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు సహాయక చర్యలు ప్రారంభించారు, ప్రమాదంలో గాయపడిన వారిని సమీప ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలానికి కలెక్టర్ శివరాజ్ సింగ్ వర్మ చేరుకుని పరిస్థితులను సమీక్షించారు. మధ్యప్రదేశ్ ప్రభుత్వం మృతుల కుటుంబ సభ్యులకు 4 లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. తీవ్రంగా గాయపడిన వారికి రాష్ట్ర ప్రభుత్వం రూ.50 వేలు, క్షతగాత్రులకు రూ.25 వేలు ప్రకటించింది.

రాష్ట్ర హోం మంత్రి డాక్టర్ నరోత్తమ్ మిశ్రా మాట్లాడుతూ, 15 మంది మరణించారని, 20-25 మంది గాయపడిన వారిని ఖార్గోన్‌లోని జిల్లా ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. మృతుల కుటుంబాలకు ముఖ్యమంత్రి ఒక్కొక్కరికి రూ.4 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించినట్లు తెలిపారు. ఘటనపై విచారణకు కూడా ఆదేశించినట్లు మిశ్రా చెప్పారు.

Tags

Next Story