అదానీ కంపెనీలపై కొత్త వివాదం

అదానీ కంపెనీలపై కొత్త వివాదం
అదానీ కంపెనీల వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతుంది

అదానీ కంపెనీల వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతుంది. తాజాగా అదానీ కంపెనీలపై కొత్త వివాదం నెలకొంది. సుప్రీంకోర్టులో మార్కెట్‌ నియంత్రణ సంస్థ సెబీ దాఖలు చేసిన రీజాయిండర్‌ అఫిడవిట్‌తో రాజకీయ వర్గాల్లో కలకలం రేగింది. 2016 నుంచి అదానీ కంపెనీలపై తాము దర్యాప్తు చేయలేదని సుప్రీం కోర్టుకు స్పష్టం చేసింది సెబీ.

మరోవైపు అదానీ కంపెనీలపై హిండెన్‌బర్గ్‌ రీసెర్చి నివేదికలో పేర్కొన్న అంశాలు చాలా సంక్లిష్టమైనవని.. దీన్ని దర్యాప్తు చేసేందుకు మరో ఆరు నెలల గడువు ఇవ్వాలని కోరింది. గత విచారణ సమయంలో మూడు నెలల గడువు ఇస్తామని ప్రధాన న్యాయమూర్తి మౌఖికంగా చెప్పారు. తాజా రీజాయిండర్‌ అఫిడవిట్‌ చూశాక.. ఎలాంటి గడువు ఇవ్వకుండా విచారణ వాయిదా వేశారు.

ఇక సుప్రీం కోర్టులో సెబీ వేసిన అఫిడవిట్‌పై రాజకీయ పార్టీలు ఆశ్చర్యం వ్యక్తం చేశాయి. అదానీ కంపెనీలపై సెబీ దర్యాప్తు చేస్తోందని పార్లమెంటు సాక్షిగా కేంద్ర ఆర్థిక శాఖ చెప్పిందని కాంగ్రెస్‌ నేత జైరామ్‌ రమేష్‌ అన్నారు. 2021 జులై 19న పార్లమెంటుకు ఇచ్చిన సమాధానంలో.. అదానీ కంపెనీలపై సెబీ దర్యాప్తు చేస్తోందని ప్రకటన చేశారని ట్వీట్‌ చేశారు. గతంలో విచారణ సెబీ విచారణ చేస్తుందని చెప్పారని.. ఇప్పుడు రీజాయిండర్‌ పిటిషన్‌లో విచారణ చేయడం లేదని చెప్పడంపై శివసేన ఎంపీ ప్రియాంక చౌదరి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. పార్లమెంటును కేంద్ర మంత్రి తప్పుదోవ పట్టించారని మండిపడ్డారు.

Tags

Read MoreRead Less
Next Story