అలప్పుజా-కన్నూరు ఎగ్జిక్యూటివ్ ఎక్స్‌ప్రెస్ రైలులో మంటలు

నెల రోజుల క్రితం అలప్పుజా-కన్నూరు ఎగ్జిక్యూటివ్ ఎక్స్‌ప్రెస్ రైలుపై జరిగిన కాల్పులను మరిచిపోకముందే, మళ్ళీ ఇప్పుడు అదే రైలులో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటన గురువారం తెల్లవారుజామున జరిగింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పారు. అయితే... రైల్వే స్టేషన్‌లో రైలు ఆగి ఉండగానే ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ మంటల్లో ఒక కోచ్ దగ్ధమైంది. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. మంటలు చెలరేగడంతో రైలు ఇతర కోచ్‌లు కోచ్ నుంచి విడిపోయాయి.
దర్యాప్తులో భాగంగా పోలీసులు అక్కడే ఉన్న భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బిపిసిఎల్) యొక్క సిసిటివి ఫుటేజీని పరిశీలించారు గుర్తు తెలియని వ్యక్తి రైలులోకి ప్రవేశించడాన్ని గమనించారు , ఆ తర్వాత అగ్ని ప్రమాదం జరిగినట్లు నిర్దారణకు వచ్చారు. ఈ ఘటన పై కేరళ బిజెపి చీఫ్ కె సురేంద్రన్ స్పందిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఛాందసవాద గ్రూపులకు మద్దతు ఇస్తున్నందునే ఇలాంటి చర్యలు జరుగుతున్నాయని ఆరోపించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com