కూలిన ట్రైనింగ్ ఎయిర్ క్రాఫ్ట్..!

కూలిన ట్రైనింగ్ ఎయిర్ క్రాఫ్ట్..!

భారత వైమానిక దళానికి (iaf )కి చెందిన ట్రైనర్ ఎయిర్ క్రాఫ్ట్ సూర్యకిరణ్ ప్రమాద వశాత్తు కూలిపోయింది. ఈ ఘటన గురువారం కర్ణాటక లోని ఛాంరాజనగర్ జిల్లా, భోగాపుర గ్రామా సమీపంలో జరిగింది. పైలెట్స్ కు ట్రైనింగ్ ఇస్తుండగా ఈ ఘటన సంభవించినట్లు అధికారులు తెలిపారు. ప్రమాదం సంభవించినప్పుడు ఎయిర్ క్రాఫ్ట్ లో ఇద్దరు పైలట్లు ఉన్నారు. అందులో ఒకరు మహిళా పైలట్. అదృష్ట వశాత్తు వీళ్లు చిన్నపాటి గాయాలతో తప్పించుకున్నారు. ఈ ఘటనపై ప్రభుత్వం ఎంక్వైరీ జరుగుతుందని అధికారులు తెలిపారు.

మూడు నెలల క్రితం రాజస్థాన్ లోని హనుమాన్ గర్ సమీపంలో జరిగిన మిగ్ -21 ఎయిర్ క్రాఫ్ట్ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు చనిపోయారు. ఈ ప్రమాదం మిగ్ 21 ఫైటర్ జెట్ ట్రైనింగ్ లో ఉండగా జరిగింది. ఈ ఘటనపై ఎంక్వైరీ వేసినట్లు అధికారులు తెలిపారు. మిగ్ -21 ఎయిర్ క్రాఫ్ట్స్ ఇప్పటికి 400 సార్లు ప్రమాదానికి గురైనట్లు నివేధికలు తెలుపుతున్నాయి. మే 8న జరిగిన మిగ్ -21 ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ ప్రమాదానికి గల కారణాలు ఇంకా పూర్తి స్థాయిలో తెలిసే వరకు భారత వైమానిక దళం వీటి ఉనికిని ఆపి వేసింది.

Next Story