Lawrence Bishnoi: బిష్ణోయ్‌ని చంపితే రూ.1.11 కోట్ల రివార్డ్

జైల్లో ఉన్న గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్‌ని ఎన్‌కౌంటర్‌లో ఏ పోలీస్ అధికారి అయిన చంపితే అక్షరాల రూ.1.11 కోట్ల రివార్డును ఇస్తామని క్షత్రియ కర్ణిసేన చీఫ్ రాజ్ సెకావత్ సంచలన ప్రకటన చేశారు. తమ జాతి గర్వించదగిన వ్యక్తి రాష్ట్రీయ రాజ్‌పుత్ కర్ణిసేన అధ్యక్షుడు అమర్ షహీద్ సుఖ్‌దేవ్ సింగ్ గోగమేడి జీని లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ కాల్చి చంపిందని క్షత్రియ కర్ణిసేన చీఫ్ ఆరోపించారు. డిసెంబర్ 5, 2023న జైపూర్‌లో నడి రోడ్డుపై గుర్తు తెలియని వ్యక్తులు ఆయనను కాల్చి చంపారని మండిపడ్డారు. తరువాత ఆ హత్య తామే చేసినట్లుగా లారెన్స్ బిష్ణోయ్ ముఠా కూడా ప్రకటించుకుందని కర్ణిసేన చీఫ్ గుర్తు చేశారు.
కాగా, ప్రస్తుతం లారెన్స్ బిష్ణోయ్ గుజరాత్‌లోని సబర్మతి జైల్లో ఉన్నాడు. 2024 ఏప్రిల్‌లో బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌ను చంపేందుకు కుట్ర చేశాడని, ఏకంగా అతడి ఇంటి బయట తుపాకీతో కాల్పులు జరిపాడనే ఆరోపణలు ఎదర్కొంటున్నాడు. ఎన్‌సీపీ నాయకుడు, మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్ధిఖీ హత్యతో ఆయనకు సంబంధం ఉన్నట్లు కూడా ఆరోపణలు ఉన్నాయి. బిష్ణోయ్ ప్రస్తుతం సరిహద్దు స్మగ్లింగ్ కేసులో జైలు శిక్షను అనుభవిస్తున్నాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com