Karnataka Elections : శివకుమార్ హెలికాప్టర్ ను ఢీకొన్న డేగ..!

కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ను పక్షి ఢీకొంది. అప్రమత్తమైన పెలెట్లు బెంగళూరులోని హెచ్‌ఏఎల్ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. హెలికాప్టర్ జక్కూర్ నుంచి మధ్యాహ్నం 12 గంటలకు బయలుదేరింది. కోలార్ సమీపంలోని ముల్బాగిలు మార్గంలో ఉన్నప్పుడు ఈ ఘటన జరిగింది. హెచ్‌ఏఎల్ విమానాశ్రయానికి 40 కిలోమీటర్ల దూరంలోని హోస్కోట్ సమీపంలో గాలిలో ఒక డేగ హెలికాప్టర్ ను ఢీకొనగా.. విండ్‌షీల్డ్ అద్దం పగిలిపోయింది.
కర్నాటక ఎన్నికల ప్రచారం హోరెత్తడంతో నాయకులందరూ రాష్ట్రంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. అందులో భాగంగానే శివకుమార్ ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. బీజేపీ కాంగ్రెస్ పార్టీలు ఢీ అంటే ఢీ అంటూ తలపడుతున్నాయి. ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలని శివకుమార్ టీం పోరాడుతోంది. అటు.. బీజేపీ మరోసారి అధికారంలోకి రావాలని ప్రచారంలో దూకుడును ప్రదర్శిస్తోంది. కేంద్రం నుంచి ప్రదాని మోదీ, అమిత్ షా లు ప్రచారంలో పాల్గొంటున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com